తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు చూపిస్తున్నారు.బీజేపీతో సీరియస్ గా తల పడేది తాను మాత్రమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ అంశాలనే కాకుండా, జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం దొరికినా కేసీఆర్ వదిలిపెట్టకుండా విమర్శలు చేస్తున్నారు.ఒకవైపు తెలంగాణ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళడంతో పాటు, దేశవ్యాప్తంగా బీజేపీ కి మళ్లీ అధికారం దక్కకుండా చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే ఎన్నో వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ, జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతున్నారు.బిజెపి పై కెసిఆర్ విమర్శలు చేస్తున్న కేంద్ర బిజెపి పెద్దలతో సఖ్యతగానే ఆయన మెలుగుతారు అనే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేసి బిజెపికి ప్రత్యామ్నాయంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విషయాన్ని కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు.అదే జరిగితే జాతీయ స్థాయిలో తన ప్రాధాన్యం మరింత పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే వామపక్ష పార్టీలను సైతం కలుపు కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.అసలు ఈ స్థాయిలో దూకుడు పెంచడానికి కారణం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నే కారణమట.
బిజెపికి వ్యతిరేకంగా గత కొంతకాలంగా రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు ప్రశాంత్ కిషోర్.
ప్రాంతీయ పార్టీలు అన్నిటినీ ఏకం చేస్తున్న ప్రశాంత్ కిషోర్ సలహాలనే కేసీఆర్ ఇప్పుడు పాటిస్తున్నట్టు గా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది తెలంగాణలో అడుగుపెట్టినా కేసీఆర్ మోదీ కి స్వాగతం పలకకుండా ‘ డుమ్మా ‘ కొట్టడానికి కారణం ప్రశాంత్ కిషోర్ సలహనే కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోది తెలంగాణకు వచ్చింది పూర్తిగా సొంత కార్యక్రమం కోసమని , దీనికి ముఖ్యమంత్రి వెళ్లాల్సిన అవసరం లేదని, దీనికి ప్రోటోకాల్ వర్తించదనే సలహాలతోనే కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నట్టు గా టీఆర్ఎస్ లోని కొంతమంది కీలక నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.