‘గణేష్ బెల్లంకొండ‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం స్వాతిముత్యం వర్ష బొల్లమ్మఈ చిత్ర కధానాయిక.లక్ష్మణ్.
కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.సంక్రాంతి పర్వదినాన ‘స్వాతిముత్యం‘ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం.సరదాగా సాగే ఈ ప్రచార చిత్రం ను గమనిస్తే.”రావు రమేష్ ఎవరితోనో ఏరా అమ్మాయిని కలిశావా పంతులు గారు తో ఇప్పుడే మాట్లాడాను .అమ్మాయి వాళ్ళ నాన్నకి పట్టింపులు ఎక్కువ పద్దతి అది ఇది అని బుర్ర తినేస్తాడంటాడేంటి అనే మాటలతో ప్రచార చిత్రం ప్రారంభమవుతుంది.ఆ తరువాత హీరోయిన్ తన తల్లి బుగ్గమీద హీరో తండ్రి బుగ్గమీద ముద్దు పెట్టుకొంటూ సెల్ఫీ దిగే సన్నివేశాలు… తదనంతరం హీరోయిన్ హీరోతో నువ్వు వర్జిన్ వా అని అడగటం దానికి అది అంటూ హీరో నీళ్ళు నమలటం మరో దృశ్యంలో.ఇప్పుడు ఏంటి కాళ్ళు కడగాలి అంతే కదా అని హీరో చేసే పని చూసి.
ఎదవ.ఎదవ సన్నాసి నువ్వు కాదు ఆళ్లు నీ కాళ్ళు కడగాలి.నా పరువు తీసేస్తున్నాడు ఈడు అంటూ రావు రమేష్ విసుక్కోవడం.ఎవరి కాళ్ళు ఎవరు కడిగితే ఏంటి నాన్న అంటూ హీరో అనటం ఇలా సరదాగా ముగుస్తుంది ఈ వీడియో చిత్రం.
వినోదమే ప్రధానంగా ఈ చిత్రం ఆద్యంతం రూపొందుతుందని ఇందులోని దృశ్యాలు చూసిన ఎవరికైనా అనిపిస్తుంది.సంభాషణలు సైతం ఈ విషయాన్ని బలపరుస్తాయి.
దర్శకుడు మాటల్లో చెప్పాలంటే ‘స్వాతిముత్యం’ లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం.జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం.
కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి.ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి.
సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి.ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది.
మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ.
గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.
‘స్వాతిముత్యం’ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, ఛాయా గ్రహణం: సూర్య, ఎడిటర్: నవీన్ నూలి, కళ: అవినాష్ కొల్ల, పి.ఆర్.ఓ.లక్ష్మీవేణుగోపాల్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన- దర్శకత్వం: లక్ష్మణ్.కె.కృష్ణ
.