వెనకటి రోజుల్లో సినిమా లను చూసేందుకు జనాలు ఎడ్ల బండ్ల మీద.ట్రాక్టర్ల మీద వచ్చే వారు.
పక్క ఊరు నుండి సైకిల్స్ వేసుకుని రిక్షాల్లో కూడా వచ్చే వారు.కాని ఇప్పుడు పరిస్థితి మారింది.
ఆ రోజులు ఇప్పుడు లేవు అనడంలో సందేహం లేదు అనుకుంటున్న సమయంలో బాలయ్య అఖండ సినిమా ఆ రోజులను గుర్తు చేశారు.బాలయ్య అఖండ సినిమాను జనాలు చూసేందుకు ఎగబడుతున్నారు.
ఇప్పటికే వంద కోట్ల వసూళ్లు క్రాస్ చేసింది.మూడవ వారంలో అడుగు పెట్టిన తర్వాత కూడా భారీగానే షేర్ వస్తోంది.
అల్లు అర్జున్ పుష్ప సినిమా వచ్చినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ బాలయ్య అఖండ వైపు పరుగులు తీస్తున్నట్లుగా అనిపిస్తుంది.తాజాగా గుంటూరు జిల్లా పెదనందిపాడు థియేటర్ కు ఫ్యామిలీ లేడీస్ పెద్ద ఎత్తున తరలి వచ్చి సినిమా చూస్తున్నారు.
వారు థియేటర్ కు ట్రాక్టర్లలో వస్తున్నారు.సాదారణంగా అయితే వారు ఇలా కూలి పనుల కోసం వెళ్తారు.కాని ఈ సినిమా కోసం వారు కూలి పని మానేసి మరీ సినిమాను చూసేందుకు అదే ట్రాక్టర్ లో వచ్చారు.ఇలాంటి సన్నివేశాలు థియేటర్ల వద్ద చూసి చాలా కాలం అయ్యింది కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బాలయ్య అఖండ మూవీ విజయం కు ఇది ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నెట్టింట అఖండ సినిమా జోరు అంతలా కనిపిస్తుంది.
బాలయ్య కేరీర్ లో మొదటి వంద కోట్ల మూవీ ఇది అంటూ టాక్ వస్తుంది.ఇక బాలయ్య మరియు బోయపాటి కి ఈ సినిమా హ్యాట్రిక్ ఇచ్చింది.
మరి కొన్ని సినిమాలు వీరు ఇద్దరి కాంబోలో రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.ముందు ముందు భారీ ఎత్తున ఈ సినిమా వసూళ్లు ఉంటాయేమో చూడాలి.