విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం, విదేశీ వ్యాపారం, ఇలా విదేశాలలో పలు రంగాల వైపు భారతీయులు ఆకర్షించబడి అక్కడే స్థిరపడుతున్నారు.ముఖ్యంగా అమెరికాలో ఉన్న వలస వాసులు అందరిలో భారత్ నుంచీ వచ్చిన వారే అత్యధికంగా ఉంటారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే భారతీయుల ప్రతిభకు అమెరికా ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తూనే ఉంటుంది.అయితే ఈ మధ్య కాలంలో అంటే కరోనా వచ్చిన నాటి నుంచీ అమెరికా విదేశీయులపై పలు రకాల ఆంక్షలు విధిస్తూనే వస్తోంది.
దాంతో అమెరికాలో ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాలలో వలస వాసుల హవా తగ్గుతూ వస్తోంది.కానీ కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మరో సారి వలస వాసుల ఎంట్రీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భారతీయ టెకీలు అమెరికా వైపు చూస్తున్నారు.
ఈ క్రమంలో జాబ్ సైట్ ఇండీడ్ ఓ సర్వే చేపట్టింది.ఈ సర్వేలో భారత విద్యార్ధులు ఉద్యోగాల కోసం ఎక్కువగా ఏ దేశం వైపు ఆకర్షితులు అవుతున్నారు.
ఎంత మంది విదేశీ ఉద్యోగాల కోసం శోధించారు అనే విషయాలు వెల్లడించింది.కరోనా కారణంగా ప్రయాణం చేయడానికి ఆంక్షలు ఉన్నా సరే ఆయా దేశాలు విధించే నిబంధనలకు లోబడి ప్రయాణాలు చేయడానికి భారతీయులు సిద్ధంగా ఉన్నారని సదరు సర్వే తెలిపింది.
2019 -21 మధ్య కాలంలో విదేశీ ఉద్యోగాలపై అత్యధికంగా భారత యువత మొగ్గు చూపిందట.ఆ సమయంలో అమెరికాలో ఉద్యోగం చేయడానికి దాదాపు 40 శాతం మంది మొగ్గు చూపారని, అలాగే కెనడా లో ఉద్యోగం చేసేందుకు 18 శాతం మంది మొగ్గు చూపారని ఆ తరువాత స్థానాలలో బ్రిటన్, సింగపూర్ , ఆస్ట్రేలియా, యూఏఈ లు ఉన్నాయని తెలిపింది.
అయితే సెకండ్ వేవ్ సమయంలో ఈ సంఖ్య తగ్గిందని సెకండ్ వేవ్ నుంచీ బయటపడిన సమయంలో మళ్ళీ విదేశీ ఉద్యోగాల కోసం యువత శోధించడం జరిగిందని చివరికి థర్డ్ వేవ్ సమయంలో కూడా కరోనా ఉన్నా సరే ఉద్యోగాలు చేస్తామంటూ గతంలో కంటే ఉద్యోగాల కోసం ఎక్కువగా భారత విద్యార్ధులు ప్రయత్నాలు చేశారని సర్వే తెలిపింది.