రైతు పండించిన పంట కొనడం ముమ్మాటికీ ప్రభుత్వ విధి ..వైఎస్ షర్మిల

వరికోనుగోలు విషయంలో బీజేపీ, కెసిఆర్ ఒకరిపై ఒకరు నెపం వేస్తూ అన్నదాతలకు సున్నం పెడుతున్నారు వడ్ల కుప్పలమీదే రైతులు చనిపోతున్న కెసిఆర్ లో చలనం లేదు వడ్లు కొనడంలో కెసిఆర్ కు ఉన్న ఇబ్బందేంటి కేంద్రానికి ఏజెంట్ గా ఎందుకు మారారో సమాధానం చెప్పాలి కేంద్రం విధించే ఆంక్షలపై ఎందుకు సంతకాలు పెట్టారు ఆంక్షలు పెట్టినరోజే ఢిల్లీలోనే కదా ధర్నాలు చేయాల్సింది, ప్రెస్ మీట్లు పెట్టాలి కానీ అది చేతకాక ఇక్కడ ధర్నాలు చేస్తారా మీరు చేసే ధర్నాల వాళ్ళ ఎవరికి ఉపయోగం వడ్లు కొనడం చేతకాక ధర్నాలు చేస్తున్నారు కెసిఆర్ 20 శాతం బోనస్ ఇచ్చిమరీ వడ్లు కొన్న ఘనత వైఎస్సార్ కే దక్కుతుంది పక్క రాష్ట్రాలు ఎమ్మెస్పీ పై బోనస్ ఇచ్చి ధాన్యం సేకరిస్తుంటే కెసిఆర్ మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు పక్క రాష్ట్రాల ప్రభుత్వాలకు రైతులపై ఉన్న చిత్తశుద్ధి కెసిఆర్ కు ఎందుకు లేదు .

 It Is The Duty Of The Government To Buy The Crop Harvested By The Farmers Shamil-TeluguStop.com

భారం మొత్తం రైతులపై మోపి తప్పించుకునే ప్రయత్నం చేయడం సమంజసం కాదు రైస్ ఎక్కడ అమ్మాలి, వాటిని ఏం చేసుకుంటారనేది ప్రభుత్వాలు చేసుకోవాల్సింది రైతు పండించిన పంట కొనడం ముమ్మాటికీ ప్రభుత్వ విధి దేశంలో ఆహారకొరత ఏర్పడితే వరి పండించిన రైతులే కదా మీ కాళ్లుపట్టుకొని బతిమలాడే స్థితికి తీసుకొచ్చేనందుకేనా బీజేపీ, టీఆరెస్ లను అధికారంలోకి తెచ్చింది మిల్లర్లకు మేలు చేయాలనే కెసిఆర్ ప్రయత్నాలు రైతు నష్టపోవాలని, మిల్లర్లు లాభపడాలనే కెసిఆర్ వడ్లు కొనడం లేదు కెసిఆర్ కు నిజాయితీ ఉంటె సివిల్ సప్లె అడిట్ రిపోర్ట్ బయటపెట్టాలి నియంత్రిత వ్యవసాయం మీద పెట్టె శ్రద్ధ మద్యం, డ్రగ్స్ పై నియంత్రణ పెడితే రాష్ట్రం బాగుపడుతుంది డ్రగ్స్ సంస్కృతి జిల్లాలకు పాకింది, ఆ పాపం కెసిఆర్ దే ప్రజల గొంతు నొక్కేయాలని ధర్నా చౌక్ మూసేయాలని చుసిన కెసిఆర్ కు మళ్ళి అదే వేదిక దిక్కు అయ్యింది.

Telugu Bjp, Farmers, Initiative, Paddy, Raithu Vedhan, Trs, Ys Sharmila, Ysr Tel

మీకు పాలనా చేతకాక ధర్నాలు చేస్తున్నారు 36 లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టిన మోసగాడు కెసిఆర్ పంటబీమా, ఇన్పుట్ సబ్సిడీ లేదు రైతు బంధు పేరిట నాలుగు వేలు ఇస్తూ 24 వేలు ఎగ్గొట్టారు వడ్లు ఎవరో కొంటె మీ బోడి పెత్తనం ఏంది కేంద్రం పెత్తనం ఏంటి ఆఖరి గింజ కొంటామని కెసిఆర్ మాట ఇచ్చారు ఆఖరి గింజ వరకు కెసిఆర్ కొనాల్సిందే మెడలు వంచుతామని చెప్పిన కెసిఆర్ ఇప్పుడెందుకు వంచలేకపోతునారు వాళ్ళ మెడలేమైనా లావు అయ్యాయా లేక మీ చేతులు సన్నగా అయ్యాయా వరి వేయవద్దని చెప్పేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారా లేక కమిషన్ల కోసం కట్టారా ఉచిత ఎరువుల హామీ ఇంకెప్పుడు అమలు చేస్తావు యంత్ర లక్ష్మి ఒక్కరికైనా యంత్రాలు ఇచ్చారా కెసిఆర్ రైతు వ్యతిరేకే ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర కెసిఆర్ దే పంట మార్చుకోవడం బట్టలు మార్చుకున్నంత సులభమా?మంత్రులను మార్చినంత సులభమా? భూముల్లో నచ్చిన పంట వేసుకొనే స్వేచ్ఛకూడా రైతులకు లేదా ఇతర పంటలు వేసుకునే భరోసా కల్గించేంత వరకు కెసిఆర్ వడ్లు కొనాల్సిందే వైఎస్సార్ సంక్షేమ పాలనలో రైతే రాజు, వ్యవసాయం పండుగ రైతును రాజునూ చేసేందుకే 72 గంటలపాటు దీక్ష చేస్తున్న సాయంత్రం నుంచి లోటస్ ఫాండ్ లో దీక్ష కొనసాగిస్తా

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube