ఈ చిన్నారిని చూసైనా భ‌యం వీడాలంటున్న ఆనంద్ మ‌హీంద్రా

జీవితంలో ఏదైనా సాధించాలంటే కావాల్సింది ధైర్యం.ఒక ప‌ని మొద‌లు పెట్టాల‌న్నా, దాన్ని పూర్తి చేయాల‌న్నా ధైర్యం అనేది ఉండాలి.

 Anand Mahindra Wants To Get Rid Of The Fear Of Seeing This Child, Anand Mahindra-TeluguStop.com

అది లేదంటే మాత్రం గ‌డ‌ప కూడా దాట‌లేం.అందుకే ఈ ప్ర‌పంచం ధైర్యం వంతుల‌కే స‌లాం కొడుతుంది.

అలాంటి ధైర్యం కొంద‌రికి మాత్ర‌మే సొంతం అవుతుంది.అందుకే వారు విజ‌యాల‌ను సాధిస్తారు.

కొంద‌రైతే ప్ర‌తి చిన్న దానికి కూడా ఏదో జ‌రిగిపోతున్న‌ట్టు భ‌య‌ప‌డుతారు.ముంద‌డుగు వేయ‌డానికి జంకుతారు.

అలాంటి వారు జీవితంలో ఏమీ సాధించ‌లేర‌ని చ‌రిత్ర స్ప‌ష్టంగా వివ‌రిస్తోంది.

భ‌యాన్ని వీడి ముంద‌డుగు వేసి విజ‌యాల తీరాన నిల‌బ‌డిన ఎంతోమందిన మ‌న ముందు క‌నిపిస్తున్నా కూడా అలాంటి వారిని ఆద‌ర్శంగా తీసుకోవ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తి చూపించం.

కానీ ఇప్పుడు చూడ‌బోయే వీడియోలో ఉన్న చిన్నారిని చూస్తేమాత్రం నిజంగానే మీలో ధైర్యం వ‌స్తుంద‌ని చెబుతున్నారు ఆనంద్ మ‌హీంద్రా. ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తున్న ఆయ‌న ఇలాంటి వీడియోల‌ను నిత్యం షేర్ చేస్తూనే ఉంటారు.

ఇప్పుడు కూడా ఓ స్ఫూర్తి దాయ‌క‌మైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఇందులో ఓ చిన్నారి ఉంది.

ఆ చిన్నారి నిటారుగా ఉన్న ఎత్తైన గోడ‌ను త‌న సంక‌ల్పంతో ఎక్కుతుండ‌టం మ‌న‌కు ఇందులో క‌నిపిస్తుంది.ఏ మాత్రం భ‌య‌మ‌న్న‌ది లేకుండా కింద ప‌డిపోతానేమో అన్న భ‌యం అత‌ని ఫేస్లో క‌నిపించ‌కుండా ఆ బుడ్డోడు గోడ‌ను ఎక్క‌డం మ‌నం ఇందులో చూడొచ్చు.అయితే మొద‌టిసారి ఈ బుడ్డోడు ప్రయత్నించి విఫ‌ల‌మ‌యినా కూడా ప‌ట్టు వ‌ద‌ల‌కుండా ట్రై చేసి పూర్తిగా పైకి ఎక్కుతాడు.రెండు మూడు సార్లు ఫెయిల్ అయినా కూడా అత‌ను మాత్రం ప‌ట్టు విడ‌కుండా ప్ర‌య‌త్నించ‌డాన్ని నెటిజ‌న్లు అభినందిస్తున్నారు.

జీవితంలో కూడా ఇలాగే పైకి ఎద‌గాలంటూ కామెంట్లు పెడుతున్నారు.మ‌రి మీ అభిప్రాయం కూడా తెల‌పండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube