చంద్రబాబు సొంత ఇలాకా కుప్పం నియోజకవర్గం చిత్తూరు ఏపీ రాజకీయాలు జరుగుతున్నాయి.మరికొద్ది రోజుల్లో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.
ఎలాగైనా గెలవాలని వైసీపీ సరికొత్త వ్యూహాలు పన్నుతోంది.మొన్న జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలలో.
జడ్పీ స్థానాలు వైసీపీ పార్టీ గెలవడం తెలిసిందే.బాబు సొంత ఇలాకాలో.
వైసీపీ పార్టీకి చెందిన 23 సంవత్సరాల అమ్మాయి.విజయకేతనం ఎగరవేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
ఇటువంటి తరుణంలో మున్సిపల్ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ప్రచారంలోకి దిగిన చంద్రబాబు దాదాపు రెండు రోజుల పాటు.మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాలలో పర్యటించడం జరిగింది.
ఈ తరుణంలో కుప్పం మున్సిపల్ లో కూడా విజయం సాధించాలని వైసీపీ ఈ ఎన్నికలలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
దీంతో వైసీపీ పార్టీకి చెందిన కీలక నాయకులు రంగంలోకి దిగారు.
కుప్పం మున్సిపాలిటీగా మారిన తర్వాత ఫస్ట్ టైం ఎన్నికలు జరుగుతున్నాయి.చంద్రబాబు ఇలాకాలో మకాం వేసేందుకు.మంత్రి పెద్దిరెడ్డి.కుప్పం లోనే దిగారు.గతంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అదేరీతిలో బద్వేల్, తిరుపతి ఉప ఎన్నికలలో.వైసీపీ తిరుగులేని విజయం సాధించటం వెనకాల మంత్రి పెద్దిరెడ్డి కృషి ఎంతో ఉంది.
దీంతో కుప్పం మున్సిపల్ ఎన్నికల బాధ్యతను కూడా వైసీపీ అధినేత జగన్… పెద్దిరెడ్డికి అప్పగించారు.
దీన్ని డీల్ చెయ్యడంలో భాగంగా చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగడంతో ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి అన్న తరహాలో సీన్ మారిపోయింది.దీంతో కుప్పం మున్సిపల్ పరిధిలో ఉన్న 25 వార్డు లలో వైసీపీ -టీడీపీ పార్టీ నేతలు నువ్వానేనా అన్నట్టుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాగా ఇటీవల జరిగిన బద్వేల్ ఉప ఎన్నికలలో.
భారీ ఎత్తున మెజార్టీ వచ్చిన క్రమంలో అదే ఫార్ములా అనగా బద్వేల్ ప్రాంతంలో వైసిపి పార్టీ కీలక నాయకులను ప్రచారంలోకి రావడంతో అదే స్కెచ్.కుప్పం మున్సిపల్ ఎన్నికలలో ఉపయోగించడానికి వైసీపీ హైకమాండ్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.