జగనన్న కాలనీల స్విమ్మింగ్ ఫూల్సా...

కృష్ణా జిల్లా మచిలీపట్నం: ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి ఆలస్యంగా పనులు ప్రారంభించిన జగనన్న కాలనీలలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి స్విమ్మింగ్ ఫుల్ ను తలపిస్తున్నాయని మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ మరియు వారి బృందం ఎద్దేవా చేశారు.టిడిపి పార్టీ అధ్యక్షుడు ఇలియాస్ పాష,కార్పొరేటర్లు సమతా కీర్తి దేవరపల్లి అనిత దిద్దకుంట సుధాకర్ అన్నం ఆనంద్,రామగాని రత్నాకర్, గంట సురేష్, బత్తిన నాగరాజు, గోకుల్.

 Machilipatnam Tdp Leaders Comments On Jagananna Colonies Flooded With Water Deta-TeluguStop.com

శివ, కట్టాదుర్గా, మరియు పార్టీ నాయకులతో కలిసి కరగ్ర హారంలోని జగనన్న కాలనీను పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇవి జగనన్న కాలనీలా లేక స్విమ్మింగ్ పూల్సా అని ఎద్దేవా చేశారు.

పేద ప్రజలు అంటే ప్రభుత్వానికి అంత చిన్న చూపు ఎందుకు.ఈ గుంతల్లో ఈ చెరువుల్లో పెద ప్రజలు ఎలా ఇల్లు నిర్మించుకోగలరు, ఈ గుంతలు పుడ్చుకోవాలంటే వారికి జీవిత కాలం పడుతుంది, ఇంకా వారి సొంత ఇంటి కల ఎలా నెరవేర్చుకోగలరు అని ప్రశ్నించారు.

మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేసినందుకు వారికి అన్నివిధాలుగా వేధిస్తున్నారు.కేవలం మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం ఊరికి దూరంగా చౌకగా దొరికే భూములను ఎంపిక చేసి అతి తక్కువ ధరకు మీరు కొని, ప్రభుత్వం చేత ఎక్కువ రేటుకు కొనిపించి దాంట్లో కమిషన్లు దండుకొని పేదవారికి తీరని ద్రోహం చేశారు.

ఇప్పుడు ఈ గుంతలు పూడ్చడానికి మళ్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా డబ్బులు వెచ్చించి ఆ డబ్బులు కూడా మట్టి పూడ్చే కాంట్రాక్టు వైసిపి నాయకులే తీసుకొని ఆ విధంగా కూడా లబ్ధి పొందుతున్నారు.పేదవాడికి ఇల్లు అనే పేరుతో వైసిపి గద్దలు ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారు.

Telugu Cmjagan, Chairmanbaba, Flooded, Iliyas Pasha, Jagananna, Krishna, Machili

సంక్షేమం పేరట పెద్ద ఎత్తున దోపిడీ చేసి పేద ప్రజలకు మాత్రము ఈ చెరువుల తలపించే స్థలాలను చూపించి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు.రెండు రోజులు కురిసిన వర్షానికే ఈ జగనన్న లేఅవుట్లు జలమయమయ్యాయి మరో రెండు రోజులు ఇదే వర్షం కొనసాగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలకే వదిలేస్తున్నాం.ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ పేద ప్రజల్ని మోసం చేయకుండా వారికి అన్ని విధాలుగా సహాయపడి ఈ ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తిచేసి పేదవారికి అందించాలని డిమాండ్ చేస్తున్నాం.అలాగే జి ప్లస్ త్రీ ఇల్లు నిర్మాణం చేపట్టి నాలుగు సంవత్సరాలు కావస్తున్న ఈ పేద ప్రజలకు ఇవ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో కూడా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

వెంటనే ఇల్లు g+3 ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో ఈ పేద ప్రజలకు న్యాయం చేసే వరకు ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube