ప్రస్తుతం ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా వినిపిస్తున్న పేరు బర్రెలక్క అలియాస్ శిరీష.( Barrelakka Sirisha ) కొల్లాపూర్ నియోజిక వర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఈమె.
ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.నిరుద్యోగ సమస్యలపై గళం విప్పుతూ జాబ్ సంపాధించడం కంటే బర్రెలు కాయడం సులభం అని సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాధించుకొని బర్రెలక్కగా పేరు పొందింది.
ప్రస్తుతం కొల్లాపూర్ నియోజిక వర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన శిరీషకు ఎన్నికల సంగం ఈల గుర్తును కేటాయించింది.

కాగా కొల్లాపూర్ బరిలో కాంగ్రెస్ తరుపున జూపల్లి కృష్ణరావు,( Jupally Krishna Rao ) అలాగే అధికార బిఆర్‌ఎస్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి( Beeram Harshavardhan Reddy ) మద్య హోరాహోరీ పోరు జరుగుతోంది.ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన బర్రెలక్క ఈ ఇద్దరికీ సవాల్ విసురుతోంది.రోజురోజుకూ బర్రెలక్కకు అన్నీ వైపులా మద్దతు పెరుగుతుండడంతో ఈమె కారణంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
కొల్లాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణరావుకు మంచి ఫాలోయింగ్ ఉంది.గతంలో నాలుగుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డ్ జూపల్లి సొంతం.కానీ గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరుపున పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమిపాలు అయ్యారు.

ఈసారి ఎన్నికల్లో ఇద్దరు పార్టీలు ఛేంజ్ అయి బీరం హర్షవర్ధన్ రెడ్డి బిఆర్‌ఎస్ నుంచి, జూపల్లి కృష్ణవరావు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బర్రెలక్క ఓటు బ్యాంకు జూపల్లికి ప్లేస్ అయ్యే అవకాశం ఉందనేది కొందరి విశ్లేషకుల అంచనా.ఎందుకంటే కేసిఆర్ ( CM kcr )ప్రభుత్వానికి వ్యతిరేకంగా బర్రెలక్క గళం విప్పుతున్న కారణంగా బీరం హర్షవర్ధన్ రెడ్డి ఓటు బ్యాంక్ చీలే అవకాశాలు ఉంది.
ఫలితంగా ఆ ప్రభావం జూపల్లికి అనుకూలంగా మారుతుందనేది కొందరి అభిప్రాయం.మరి బర్రెలక్క కారణంగా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి మేలు జరుగుతుందా ? లేదా ఇద్దరికి షాక్ ఇస్తూ ఆమెనే విజయం సాధిస్తుందా అనేది చూడాలి.