జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు విశాఖకు వెళ్లనున్నారు.ఈ మేరకు ఫిషింగ్ హార్బర్ ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు.
హార్బర్ ఘటనలో నష్టపోయిన బాధితులను పరామర్శించనున్న పవన్ కల్యాణ్ అనంతరం ఆర్థిక సాయం అందించనున్నారు.ఈ క్రమంలో మొత్తం 49 కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పవన్ సాయం అందజేయనున్నారు.కాగా రెండు రోజుల క్రితం ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారులకు చెందిన పలు బోట్లు అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే.