ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో 2024 ఎన్నికలలో ( 2024 elections )విజయం సాధించడానికి ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పొత్తులతో ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు.
ఈ క్రమంలో బీజేపీ , జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరిగింది.ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ చీలిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఎన్నికల సమీపిస్తున్న కొలది తెలుగుదేశం పార్టీలో చాలామంది నేతలు జాయిన్ అవుతున్నారు.
ఈ రకంగానే రాయలసీమ ( Rayalaseema )ప్రాంతానికి చెందిన ప్రముఖ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి( Byreddy Rajasekhar Reddy )ఆయన కుమార్తె బైరెడ్డి శబరి టీడీపీలో చేరారు.వీరికి చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఇదిలా ఉంటే జరగబోయే ఎన్నికలలో బైరెడ్డి శబరి నంద్యాల టీడీపీ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఆల్రెడీ చంద్రబాబు( Chandrababu ) ఆమెకు టికెట్ ఖరారు చేసినట్లు సమాచారం.2024 ఎన్నికలను చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎట్టి పరిస్థితులలో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.వైసీపీ అధికారంలోకి రాకుండా తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు.దీంతో ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలో చాలామంది నేతలు జాయిన్ అవుతున్నారు.శుక్రవారం చంద్రబాబు సమక్షంలో రాయలసీమ ప్రాంతంలో ప్రముఖ నేతగా పేరున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది.