ఆ పదవిలో ప్రస్తుతానికి రేవంతే ! ఆ తరువాత ఎవరు ? 

తెలంగాణలో అనుకున్నట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సారథ్యంలో ఈ విజయం దక్కడంతో ఆయనకే సీఎం పోస్టు దక్కింది.

 Telangana Elections, Telangana Government, Pcc Chief, Aicc, Rahul Gandhi, Pcc Ch-TeluguStop.com

ఆ పదవిలో రేవంత్ తీరికలేకుండా ఉండబోతుందడంతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు పార్టీ అధిష్టానం ఎవరికి అప్పగించబోతుందనే చర్చ గత కొద్దిరోజులుగా మొదలైంది.రేవంత్  ముఖ్యమంత్రి పదవులు తీరిక లేకుండా ఉంటారని అందుకే పార్టీ పగ్గాలు వేరొకరికి అప్పగించారని అధిష్టానం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఇప్పటికిప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా కొత్తవారిని నియమిస్తే రాబోయే స్థానిక సంస్థలు ,పార్లమెంట్ ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తుతాయనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉందట.  అందుకే పార్లమెంట్ ఎన్నికల తరువాతే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  రేవంత్ సారథ్యం లోనే పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయని ఏఐసిసి అధిష్టానం కూడా ఈ విషయంలో క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అంతే సమర్థత ఉన్న నాయకుడికి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్నా,  ఏ సామాజిక వర్గానికి చెందిన నేతకు అప్పగించాలనే విషయంపై చర్చ జరుగుతుంది .గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పదవిలో ఉండగా,  ఆ తర్వాత నుంచి రేవంత్ రెడ్డి కొనసాగుతూ వస్తున్నారు.అప్పట్లో రేవంత్ కు కాకుండా ఆ పదవి తమకే ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి , మల్లు భట్టి విక్రమార్క,  దామోదర రాజనర్సింహ,  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వంటి వారు గట్టి ప్రయత్నాలు చేశారు.

కానీ అప్పట్లో రాహుల్ మొగ్గు చూపించారు.అప్పట్లో ఈ పదవి ఆశించిన వీరంతా ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు.దీంతో ఈ పదవుల్లో ఉన్నవారికి పిసిసి అధ్యక్ష పదవి దక్కే అవకాశం లేదనే చెప్పాలి.

Telugu Aicc, Pcc, Rahul Gandhi, Revanth Reddy, Telangana Cm, Telangana-Politics

మొన్న జరిగిన ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామని , 34 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.కానీ 24 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించింది.దీంతో పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

టి.పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , మధు యాష్కీ గౌడ్, ఓబీసీ జాతీయ నేత కత్తి వెంకటస్వామి గౌడ్ తో పాటు, మరికొంతమంది ఈ పదవిని ఆశిస్తున్నారు.

మధు యాష్కీ గౌడ్ రెండుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయారు.అయితే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దల పలుకుబడి ఉంది.

దీంతోపాటు మహేష్ కుమార్ ,కత్తి వెంకటస్వామి తదితరులు ఆశలు పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube