డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ సినిమా ప్రారంభం అయ్యి దాదాపుగా మూడు ఏళ్లు అవుతోంది.కరోనా కారణంగా దాదాపు గా రెండు ఏళ్ల నుండి సినిమా అదుగో ఇదుగో అంటూనే వాయిదా వేయడం జరిగింది.
కరోనాకు ముందు విడుదల తేదీని ప్రకటించారు.కాని షూటింగ్ ముగించకుండానే కరోనా మొదలు అయ్యింది.
సినిమా టైటిల్ ను ప్రకటించిన సమయం లో ఫస్ట్ లుక్ విడుదల చేసిన సమయం లో ఆ ఫస్ట్ లుక్ గురించి వర్మ స్పందించిన సమయంలో సినిమా పై జనాల్లో బజ్ క్రియేట్ అయ్యింది.కాని ఇప్పుడు సినిమా గురించి పెద్దగా జనాల్లో ఆసక్తి కనిపించడం లేదు.
ఎందుకంటే అదుగో ఇదుగో అంటూ సినిమా జనాలను ఊరించి ఊరించి ఉసూరుమనిపించారు.అందుకే ప్రేక్షకులు రొమాంటిక్ ను ఇప్పటి వరకు అయితే రొటీన్ అన్నట్లుగా లైట్ తీసుకుంటున్నారు.
ఈ సినిమా ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.రొమాంటిక్ సినిమా షూటింగ్ ముగించి వచ్చే వారంలో విడుదల చేసేందుకు అధికారికంగా ప్రకటన చేశారు.

మొన్నటి వరకు ఓ టీ టీ రిలీజ్ అనుకున్న ఈ సినిమా ను థియేటర్ల ద్వారా విడుదల చేస్తున్నారు కనుక జనాల్లో బజ్ క్రియేట్ చేయడం కోసం ప్రభాస్ ను రంగంలోకి పూరి దించాడు అంటున్నారు.ఈ సినిమా లో ఆకాష్ పూరి రొమాన్స్ అదిరి పోతుందని అంటున్నారు.కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయినా కూడా ఖచ్చితంగా ప్రభాస్ బజ్ కారణంగా జనాల్లో సినిమా గురించిన చర్చ మొదలు అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.ప్రభాస్ వల్ల ఈ సినిమా బిజినెస్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.