ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రియాలిటీ షో ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తూ ప్రసారమవుతుంది.ఈ క్రమంలోనే కొందరు సెలబ్రెటీలు బిగ్ బాస్ లో ఉన్న ఆ కంటెస్టెంట్ కు మద్దతు తెలపండి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అభిమానులను వేడుకుంటున్నారు.
ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు ప్రియాంక సింగ్ కే తన మద్దతు తెలపగా, టిక్ టాక్ దుర్గారావు యాంకర్ రవికి తన మద్దతును తెలియజేశారు.
తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఆ కంటెస్టెంట్ కే తన సపోర్ట్ అంటూ ఓ వీడియోని అభిమానులతో పంచుకున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లో ఎంతో కూల్ గా ఉంటూ.తనని రెచ్చగొట్టేలా మాట్లాడిన ఏమాత్రం సహనం కోల్పోకుండా ప్రేక్షకులను తనదైన శైలిలో ఎంటర్ టైన్ చేస్తున్నటువంటి మానస్ నాగులపల్లి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే విధంగా ఆడుతున్నాడని తన సపోర్ట్ మానస్ కేనని ఈ సందర్భంగా సందీప్ కిషన్ తెలియజేశారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం ప్రసారం కాకముందు చేసినటువంటి ఒక వీడియో సందీప్ కిషన్ ఈ సందర్భంగా షేర్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ వీడియోలో భాగంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ… బిగ్ బాస్ షో లో నాకు నచ్చిన నాకు కావాల్సిన వ్యక్తి మానస్.ఎంతో మంచి మనసున్న అతను మీ అందరికీ నచ్చుతాడని, అతను మీ అందరి మనసులు గెలుచుకొని బయటకు వస్తాడని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ లవ్ యూ అంటూ.ఈ సందర్భంగా తన మద్దతు తెలుపుతూ ఒక వీడియోను షేర్ చేశారు.