తెలుగులో ఒకప్పుడు పలు చిత్రాలు మరియు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటుడు “హేమ సుందర్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.కాగా సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో హేమ సుందర్ అవకాశాలను బాగానే అంది పుచ్చుకున్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల సినిమా పరిశ్రమలో పెద్దగా నిలదొక్కుకోలేకపోయాడు.
దీంతో నటన పరంగా మంచి ప్రతిభ ఉన్నటువంటి హేమ సుందర్ సినిమా అవకాశాలను మాత్రం దక్కించుకోలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితం అయ్యాడు.కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన వ్యక్తి గత జీవితం మరియు సినీ జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా అప్పట్లో తనకి సినిమా పరిశ్రమలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా మంచి స్నేహితుడు మరియు సన్నిహితంగా ఉండేవాడని తెలిపాడు.సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో రజనీకాంత్ మరియు తాను కలిసి ఒకే స్కూటర్ పై వెళ్లే వాళ్ళమని చెప్పుకొచ్చాడు.
అప్పట్లో రజనీకాంత్ తో తాను చాలా చనువుగా ఉండేవాడినని అలాగే అందరూ తనని రజనీకాంత్ అని పిలిచినప్పటికీ తాను మాత్రం నల్లోడు, కర్రోడు, ఇలా పిలిచే వాడినని తమ ఇద్దరి మధ్య అంత చనువుండేదని తెలిపాడు.
అంతేకాకుండా రజినీకాంత్ కొన్ని వందల కోట్ల రూపాయలకు అధిపతి అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడని అలాగే ఇప్పటికీ ఎక్కడెక్కడ తనకి ఆస్తులు ఉన్నాయనే విషయం రజినీకాంత్ కి సరిగ్గా తెలియదని చెప్పుకొచ్చాడు.అలాగే ఈ సినిమా షూటింగ్ సెట్లో కూడా చాలా సరదాగా ఉంటూ బీద, ధనిక మరియు పెద్ద, చిన్న అనే తేడాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తూ కలుపుకుంటూ వెళ్తాడని చెప్పుకొచ్చాడు.అలాగే సూపర్ స్టార్ అనే బిరుదు కి నిజంగా రజనీ కాంత్ అర్హుడని కితాబిచ్చాడు.
అలాగే రజనీకాంత్ కి స్టార్డం వచ్చిన తర్వాత తను పెద్దగా టచ్ లో లేనని కానీ రజనీకాంత్ ఎక్కడ కలిసిన చాలా ఆప్యాయంగా పలకరిస్తాడని అలాగే తమ మధ్య ఆర్థిక బేధాలు స్టార్ డం వంటివి అస్సలు ఉండవని కూడా స్పష్టం చేశాడు.ఈ విషయం ఇలా ఉండగా నటుడు హేమ సుందర్ తెలుగు, తమిళం తదితర భాషల్లో దాదాపుగా 100కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాడు.
అలాగే అరడజనుకు పైగా సీరియళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించాడు.