చిరంజీవి వీడియో లీక్ వెనక ఏపీ సర్కారు ఉద్దేశం అదేనా?

ప్రభుత్వం అన్నాక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలి.అంతేకాదు.

 Why Ycp Sarkar Leaked Chiranjeevi Video , Chiranjeevi, Jagan, Ycp, Ycp Governam-TeluguStop.com

సమస్య వస్తే ఏ సర్కారు అయినా సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తుంది కూడా.ఒకవేళ చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకుంటే మధ్యవర్తిత్వం ద్వారా ఆయా సమస్యలను క్లియర్ చేసుకుంటుంది.

అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఏ సమస్యలోనైనా తన పట్టుదలనే నిరూపించుకుంది.ఎదుటి పక్షాన్ని తమ పాదాల ముందుకు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేసింది.

గతంలో వచ్చిన చాలా సమస్యలు ఇలానే క్లియర్ అయ్యాయి.తన మాటనే నెగ్గించుకుంటూ వచ్చింది జగన్ సర్కారు.

ప్రభుత్వంపై ఒంటికాలుతో లేచిన ఉద్యోగులను కూడా చివరకు తన దారిలోకి తెచ్చుకుంది.రాజధాని విషయంలోనూ తన మాటే నెగ్గించుకున్నాడు.

తాజాగా సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం తానే మేటి అనిపించుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ సమస్యల విషయంలోనూ జగన్ సర్కారు తన పంతాన్ని నెగ్గించుకుంది.

తను చెప్పిందే అమలు చేసేయాలని తీర్మానం చేసుకుంది.ఒకటి రెండు చిన్న విషయాలు మినహా.

మొత్తం వ్యవహారంలో టాలీవుడ్ ను తన దగ్గరికి రప్పించుకోవడంలో సక్సెస్ అయ్యింది.ప్రభుత్వం ఓ విషయంలో గట్టిగా పట్టుబడితే ఎంతటి వారైనా దిగిరాక తప్పదు అని నిరూపించింది.

దీనికి ఎగ్జాంఫుల్ చిరంజీవి సీఎంతో సమావేశంలో చేసిన కామెంట్స్.అమ్మలా పెద్ద మనసు చేసుకుంటారని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా అంటూ జగన్ ను వేడుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

సీఎం సమావేశానికి సంబంధించిన విజువల్స్ మాత్రమే బయటకు వచ్చాయి.కానీ చిరంజీవి మాట్లాడిన మాటలు అనంతరం బయటకు వచ్చాయి.పక్కాగా ప్రభుత్వ పెద్దలు దీన్ని చూసే రిలీజ్ చేశారు.తమకు ఎంత వరకు అవసరమో.అంత వరకు మాత్రమే ఎడిట్ చేసి బయటకు వదిలారు.మొత్తంగా చిరంజీవితో చేతులు జోడించి అనే మాటను చెప్పించారు సర్కారు పెద్దలు.

దీన్ని బట్టి తాను అనుకున్నదే సాగాలి అనే పట్టుదలతో సర్కారు ముందుకు పోతుందనే విషయం తేలిపోయింది.మొత్తంగా సర్కారుతో పెట్టుకోకూడదు అనేలా టాలీవుడ్ పెద్దలకు తెలిసి వచ్చేలా చేశాడు సీఎం జగన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube