తెలుగు సినీ నటి రేణు దేశాయ్ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకుంది.
ఇక పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అయింది.ఇక వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఆ తర్వాత పవన్, రేణు దేశాయ్ కొన్ని మనస్పర్థల వల్ల విడిపోగా అప్పటినుండి రేణు దేశాయ్ ఒంటరి జీవితాన్ని గడుపుతూ తన పిల్లలను తానే చూసుకుంటుంది.
ఈమధ్య బుల్లితెరకు కూడా పరిచయమైంది రేణు దేశాయ్.
జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ లో జడ్జిగా చేస్తుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా మారింది.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో తన వంతు సహాయంతో ముందుకు వచ్చింది.ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వాళ్ళు అడిగిన సహాయానికి వెంటనే స్పందించింది.
ఇక తన పిల్లలు అకీరానందన్, ఆధ్య ను అభిమానులకు పరిచయం చేసింది.
తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా బాగా షేర్ చేసుకుంటుంది.
ఈ మధ్య తన కూతురు ఫోటోలను కూడా పంచుకుంటుంది.ఇదిలా ఉంటే రేణు దేశాయ్ కి మూగ జీవులు అంటే ఎంతో ఇష్టం.
ఇక రెండు రోజుల కిందట తాను ముద్దుగా పెంచుకునే పిల్లులు తప్పిపోయాయని బాధపడుతూ పోస్ట్ చేసింది.ఇక ఆ పోస్ట్ వైరల్ గా మారగా నెటిజన్లు వెంటనే స్పందించారు.
ఇక ఆ పోస్ట్ డిలీట్ చేయడంతో నెటిజన్లు ఏమైందో అని ప్రశ్నించారు.ఆ ప్రశ్నలకు స్పందించిన రేణు రెండు రోజుల కిందట సాయంత్రం సమయాన డోర్ తెరిచి ఉంచడంతో ఘోరం జరిగిందని, రెండు పిల్లులు బయటకు వెళ్లాయని ఎంత వెతికినా దొరకలేదని తెలిపింది.
ఇక అవి ఎక్కడున్నా బాగుండాలని ఎవరో ఒకరు వాటిని జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తున్నా అంటూ తెలిపింది.ఇక తాజాగా తప్పిపోయిన పిల్లులు దొరికాయని అభిమానులతో పంచుకుంది.ఈరోజు ఉదయం తమ బిల్డింగ్ గార్డెన్ ఏరియాలో అవి కనిపించాయని అభిమానులందరు చేసిన ప్రార్థనలకు ధన్యవాదాలు అంటూ తెలిపింది.రెండు రోజుల బాధంతా తీరిపోయిందని, ఊపిరిపీల్చుకున్నట్లు అవుతుందని తన సంతోషాన్ని బయటికి చెప్పుకుంది రేణుదేశాయ్.