దృశ్యం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన మలయాళీ దర్శకుడు జీతూ జోసెఫ్.ఈ టాలెంటెడ్ దర్శకుడు తెరకెక్కించిన ఆ మూవీ ఇండియన్ బాషలతో పాటు చైనీస్ బాషలో కూడా రీమేక్ అయ్యింది.
ఇక గత ఏడాది కరోనా లాక్ డౌన్ సమయంలో దృశ్యం సీక్వెల్ ని కూడా తెరకెక్కించి జీతూ జోసెఫ్ మరో హిట్ ని ఖాతాలో వేసుకోవడంతో పాటు బ్రిలియంట్ డైరెక్టర్ అనే గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ నేపధ్యంలో దృశ్యం 2 తెలుగు రీమేక్ బాద్యతలని సురేష్ బాబు జీతూ జోసెఫ్ కి అప్పగించారు.
ఇక తెలుగులో కూడా ఆ మూవీ రీమేక్ షూట్ కంప్లీట్ అయ్యింది.ఇక దృశ్యం 2 తమిళ్ రీమేక్ బాద్యతలు కూడా జీతూ జోసెఫ్ కి కమల్ హసన్ అప్పగించినట్లు బోగట్టా.
ఇదిలా ఉంటే తెలుగులో దృశ్యం 2 రీమేక్ సమయంలో జీతూ జోసెఫ్ వర్క్ స్టైల్, అతని మేకింగ్ విజన్ కి నిర్మాత సురేష్ బాబు భాగా కనెక్ట్ అయిపోయాడని వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో అతనికి మరో ఆఫర్ ని కూడా సురేష్ బాబు ఇచ్చారని టాక్.
మరో మంచి థ్రిల్లర్ కథని సిద్ధం చేయమని జీతూ జోసెఫ్ కి సురేష్ బాబు చెప్పారని సమాచారం.ఇక తెలుగులో రెండో సినిమాకి చేసే అవకాశం వెంటనే రావడంతో ఈ దర్శకుడు కూడా ఒకే చెప్పి కథని సిద్ధం చేసే పనిలో పడ్డారని తెలుస్తుంది.
ఇక ఈ సెకండ్ మూవీ వర్క్ అవుట్ అయితే తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం కూడా జీతూ జోసెఫ్ సొంతం చేసుకునే అవకాశం ఉంది.అయితే మలయాళంలో స్టార్ హీరోలు ఇచ్చిన స్వేచ్చ దర్శకులకి తెలుగు హీరోలు ఇవ్వరనే టాక్ మొదటి నుంచి ఉంది.
ఈ నేపధ్యంలో సురేష్ బాబు ఆఫర్ ని జీతూ జోసెఫ్ ఎంత వరకు ఉపయోగించుకుంటారు అనేది చూడాలి.