కరోనా సెకండ్ వేవ్ కారణంగా.తెలంగాణ ప్రభుత్వం మొన్నటిదాకా కఠిన ఆంక్షలు విధించింది.
విద్యా సంస్థల విషయంలో పబ్లిక్ సమావేశాలకు సంబంధించి ఇంకా ప్రార్థన మందిరాలు అదేరీతిలో బస్సు రాకపోకల విషయంలో.ఆంక్షలు విధించే రీతిలో వైరస్ ని కట్టడి చేయడానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తి వేయడం జరిగింది.
దీంతో లాక్ డౌన్ ఎత్తివేత తో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా అంగీకారం తెలిపింది.ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఏపీలో కి తెలంగాణ బస్సు సర్వీసులు… ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కర్ణాటకలో కి తెలంగాణ బస్సు సర్వీసులు… నడపడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
రేపటి నుండి ఈ బస్సు సర్వీసులు అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.కరోనా ఆంక్షలు పాటిస్తూనే బస్సు సర్వీసులు నడపాలని టిఎస్ఆర్టిసి తెలంగాణ ప్రభుత్వం సూచించింది.
అదేరీతిలో మహారాష్ట్ర నిబంధనలు పాటిస్తూ మంగళవారం నుండి బస్సు సర్వీసులు ప్రారంభించాలని డిసైడ్ అయింది.