టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను.తన గ్లామర్ తో, నటనతో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
ఆ తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది తాప్సీ.
ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
2010లో ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.ఆ తర్వాత స్టార్ హీరోల సరసన అవకాశాలు కూడా అందుకుంది.
ఇక 2011లో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.ఎక్కువ లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి అభిమానులను ఆకట్టుకుంది.
మధ్యలో కొన్ని ప్లాప్ లను కూడా ఎదుర్కొంది.ఇదిలా ఉంటే తాప్సీ తన కెరీర్ ఆరంభం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.
తాను బాలీవుడ్ లో చష్మే బద్దూర్ సినిమాకు ఎటువంటి ఆడిషన్ ఇవ్వకుండానే సెలెక్ట్ అయ్యానని తెలిపింది.తన కెరీర్ ఆరంభంలో తనని తాను చూసుకుంటే ప్రీతి జింటా గుర్తొచ్చేదని ఆ వైబ్స్ చూసి తనకు ఆఫర్ ఇచ్చారని తెలిపింది.
ఆడిషన్స్ ఇబ్బంది లేకుండానే తనకు సినిమాల్లో అవకాశం దక్కినందుకు దేవుడికి థాంక్స్ చెప్పుకున్నానని తెలిపింది.ఇక తనకు ఒక ఏడాదికి ఒక సినిమా చేయాలంటే ఇష్టం ఉండదట.

తనకు విలాసవంతమైన జీవితం గడపడం అంటే ఎంతో ఇష్టమని, ఆరంభంలో అవకాశాలు దక్కక కెరీర్ ఒడుదుడుకులు ఎదురయ్యాయని తెలిపింది.కెరీర్ ప్రారంభంలో తను నటించిన పాత్రలు రొటీన్ గా ఉండేవని.అందుకే అలాంటి పాత్రలు చేయడానికి విసిగిపోయానంటూ, ఇక అలాంటి పాత్రలు చేయలేను అని తెలిపింది తాప్సీ.