ప్రపంచంలో ఎన్నో ప్రత్యేక కట్టడాలు, పురాతన కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.అందులో కొన్ని సహజంగా ఏర్పడినవి.
మరికొన్ని మనుషులు నిర్మించినవి.అలాంటి ప్రదేశాను చూడటానికి పర్యాటకులు ఎప్పుడు వస్తుంటారు.
వాటికి చారిత్రిక సంపదగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో కూడా పర్యటన ప్రదేశాలు, పురాతన ప్రదేశాలు, సహజసిద్ధమైన నిర్మాణాలు ఉన్నాయి.
సహజంగా ఏర్పడిన పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన డార్విన్ ఆర్చ్ తాజాగా సముద్రంలో కూలిపోయింది.ఇది దక్షిణ పసిఫిక్ సముద్రంలోని గాలాపోగోస్ ద్వీపకల్పంలో ఉంది.
డార్విన్ ఆర్చ్ అనేది ఒక స్తంభాల నిర్మాణం.ఇది రాతితో, మునిగిపోయిన పీఠభూమిపై ఉంటుంది.
దీనిని ది థియేటర్ అని కూడా పిలుస్తారు.రెండు స్తంభాల మధ్య వారధిలా నిలిచిన ఈ డార్విన్ ఆర్చ్ మే 20న సముద్రంలో కూలిపోయింది.

ఈ డార్విన్ ఆర్చ్ ఫోటోగ్రాఫర్ లు, క్రూయిజ్-షిప్ పర్యటనలతో ప్రపంచ ప్రసిద్ది చెందింది.ఈ కట్టడం చుట్టూ ఉన్న గొప్ప వన్యప్రాణులు దీనిని ఒక ప్రసిద్ధ స్కూబా డైవింగ్ ప్రదేశంగా మార్చాయి.డార్విన్ ఆర్చ్ పై అడుగు పెట్టడానికి పర్యాటకులకు అనుమతి లేదు. గాలపాగోస్ దీవుల పరిసర ప్రాంతాన్ని 1978 లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
ఇన్ని రోజులుగా రెండు స్తంభాలపైన ఒక తోరణంలా ఉన్న ఈ డార్విన్ ఆర్చ్ ప్రస్తుతం కూలిపోయింది.రెండు వైపులా స్తంభాలుగా కనిపించే భాగం మాత్రం కూలిపోలేదు.
తూర్పు ద్వీపానికి 600 మైళ్ల దూరంలో ఉన్న ఈ డార్విన్క్ ఆర్చ్ ఇలా కుళ్లిపోవడానికి సముద్రపు సహజ కోత కారణమై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.ఈ ఆర్చ్ డార్విన్ ద్వీపంలో ఒక భాగమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ సహజసిద్ధ ప్రత్యేక నిర్మాణానికి ప్రముఖ సైంటిస్ట్ చార్లెస్ డార్విన్ పేరు పెట్టారు.డార్విన్ ద్వీపం నుండి ఇది ఒక కిలో మీటర్ కంటే తక్కువ దూరంలో.
సముద్రం నడిబొడ్డున ఉంటుంది.