తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సినిమా అవకాశాల కోసం వచ్చిన మొదట్లో పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి హీరో హీరోయిన్లుగా నిలదొక్కుకున్న నటీనటులు చాలామందే ఉన్నారు.అయితే ఇందులో పలు టాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్ స్నేహితురాలు అలాగే అక్క, చెల్లి తదితర పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగానే మెప్పించిన ప్రముఖ తెలుగు నటి “కల్పిక గణేష్” ఒకరు.
అయితే మొదట్లో ఈ అమ్మడు వెంకటేష్ మరియు ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ చిత్రానికంటే ముందుగా పలు చిత్రాలలో నటించినప్పటికీ ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.
అయితే ఈ మధ్య కాలంలో నటి కల్పిక గణేష్ నటన పరంగా పలు మెళుకువలను నేర్చుకుంటూ తన నటనా ప్రతిభను మరింత మెరుగు పరుచుకుంది.అంతేకాకుండా హీరోయిన్ గా అవకాశాల కోసం కూడా బాగానే ప్రయత్నిస్తోంది.
అయితే ఆ మధ్య “సీత ఆన్ ద రోడ్, మై డియర్ మార్తాండం” తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
కానీ ఈ అమ్మడి నటనకు మాత్రం సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందాయి.అయితే నటన పరంగా మంచి టాలెంట్ ఉన్నటువంటి కల్పిక గణేష్ కి సరైన హిట్టు పడితే హీరోయిన్ కావడానికి పెద్దగా సమయం పట్టదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా ఇకపై తన తదుపరి చిత్రాలలోని పాత్రల విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా సూచిస్తున్నారు.
అయితే ఇలా సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి హీరో హీరోయిన్లుగా నిలదొక్కుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు.
ఇందులోప్రముఖ హీరో రవి తేజ, సాయి రాం శంకర్, సునీల్, సుడిగాలి సుదీర్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ఫేమ్ హిమజ తదితరులు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా రాణిస్తున్నారు.