ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజలు లక్షల సంఖ్యలో మరణించారు.
అంతేకాకుండా కోట్ల సంఖ్యలో ఈ కరోనా వైరస్ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఇప్పటికే ఈ కరోనా వైరస్ భారత దేశంలో రోజురోజుకీ ప్రబలతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలను అమలు చేస్తున్నాయి.
అంతేకాకుండా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారికి వైద్య సేవలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీనికి తోడు ఈ మధ్య ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో చాలా మంది భయ భ్రాంతులకు గురవుతున్నారు.
అయితే ఈ కరోనా వైరస్ మహమ్మారి గురించి శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు గతంలోనే ఓ పద్యం ద్వారా చర్చించారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇందులో ముఖ్యంగా ఈశాన్య దిశన ఉన్న దేశంలో ఓ గాలి సోకి కోటి మందికి పైగా ప్రజలు మరణిస్తారని అలా జరిగిన తర్వాతే ఆ గాలి ప్రభావం ప్రజలపై ఉండదని అర్థం ఉందని కూడా అంటున్నారు.
దీంతో కొందరు ప్రజలు గతంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్లే జరుగుతోందని ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా వైరస్ మహమ్మారి సోకి దాదాపుగా 30 లక్షల మందికి పైగా మరణించారు.అయితే కరోనా వైరస్ ఈశాన్య దిశన ఉన్నటువంటి చైనా దేశం నుంచి ఇతర దేశాలకు సోకింది.
దీంతో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం మరోమారు నిజం కాబోతోందని కాబట్టి మానవ ప్రపంచం ఎలాంటి పరిణామాలు అయినా సరే ఎదుర్కొని నిలబడడానికి సన్నద్ధం అవ్వాలని కొందరు జ్యోతిష్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
దీంతో దేశంలోని పలువురు సినీ సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు ఆక్సిజన్ కొరతను అరికట్టేందుకుగాను కోట్ల రూపాయల విరాళాన్ని అందిస్తున్నారు.అయినప్పటికీ ఆక్సిజన్ కొరతను మాత్రం తీర్చలేక పోతున్నారు.
అంతేకాకుండా కరోనా సెకండ్ వేవ్ వచ్చినప్పుడు సరైన ప్రణాళికలు లేకపోవడం వల్లే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.