కరోనా సెకండ్ వేవ్ పేరు వింటే ప్రజలు గజగజా వణాకాల్సిన పరిస్థితి ఏర్పడింది.హాస్పిటల్ లో బెడ్ల కొరత వల్ల కరోనా సోకిన వాళ్లలో చాలామంది హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స చేయించుకుంటున్నారు.
అయితే కరోనాతో బాధ పడుతున్న వారిలో కొంతమంది ఆహారం విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.అలా ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయడానికి తారక్ ఫ్యాన్స్ ముందుకు వచ్చారు.
తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో హోం క్వారంటైన్ లో ఉంటూ ఆహారం విషయంలో ఇబ్బందులు పడుతున్న వాళ్లకు టీమ్ తారక్ ట్రస్ట్ ఆహారాన్ని అందించడానికి సిద్ధమయ్యారు.తారక్ ఫ్యాన్స్ చేస్తున్న పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పేరుతో చాలా సంవత్సరాల నుంచి ఈ సంస్థ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.తారక్ ఫ్యాన్స్ తీసుకున్న నిర్ణయం హోమ్ క్వారంటైన్ లో ఉన్న కరోనా రోగులకు ఉపయోగపడనుంది.

ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఈ విధంగా సహాయం చేయడానికి ముందుకొస్తే కరోనా రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండగా ఈ ఏడాది సెకండాఫ్ లో కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.ఎన్టీఆర్ 31వ సినిమాకు సంబంధించి ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో చూడాల్సి ఉంది.
ఎన్టీఆర్ సినిమాల ఎంపిక విషయంలో తొందర పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు.2022 సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.ఏప్రిల్ లో కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తుండగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.కేజీఎఫ్ 2 సినిమా తరువాత ఈ సినిమా తెరకెక్కనుంది.