నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నెయ్యి రుచి, వాసన రెండూ కూడా అద్భుతంగా ఉంటాయి.
అందుకే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ నెయ్యిని అమితంగా ఇష్టపడుతుంటారు.కానీ, కొందరు మాత్రం నెయ్యికి బదులుగా డాల్డా వాడుతుంటారు.
పామాయిల్ చెట్టు నుంచి తయారుచేయబడ్డ హైడ్రోజినేటెడ్ ఆయిల్‌నే డాల్డా అంటారు.
అయితే ఈ డాల్డాను తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పక్కన పెడితే.
బోలెడన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా డాల్డాను ఓవర్‌గా తీసుకుంటే.
అందులో ఉండే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచేస్తుంది.దాంతో మధుమేహం వ్యాధి బారిన పడాల్సి వస్తుంది.
ఒక వేళ మీకు ముందే మధుమేహం వ్యాధి ఉంటే మీరు డాల్డాను అస్సలు తీసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.
అలాగే నెయ్యికి బదులుగా డాల్డాను వాడటం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి.దాంతో అధిక బరువు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇక ఊబకాయం సమస్యతో బాధ పడే వారు డాల్డా తీసుకుంటే.
మరింత బరువు పెరిగి పోతారు.డాల్డాను అతిగా తీసుకుంటే.
అందులో ఉండే హానికరమైన ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లు పెద్ద పేగు కాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
అంతేకాకుండా, డాల్డాను నెయ్యికి బదులుగా తీసుకోవడం వల్ల.
ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవుతుంది.దాంలో జలుబు, దగ్గు, ఆస్తమా మరియు ఇతర శ్వాసకోశ అలర్జీలు కూడా సంభవిస్తాయి.
ఇక ప్రెగ్నెన్సీ మహిళలు అస్సలు డాల్డా తీసుకోరాదు.ఎందుకంటే, గర్భవుతులు డాల్డాను డైట్లో చేర్చుకోవడం వల్ల పుట్టే శిశువుల్లో దృష్టి లోపాలు వచ్చే ప్రమాదం ఎక్కువ.
సో.వీలైనంత వరకు డాల్డాను ఎంత ఎవైడ్ చేస్తే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.