ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల క్రికెట్ జట్లలో భారత సంతతికి చెందిన క్రికెటర్లు ఆడుతూ వుంటారు.ఫిబ్రవరి 22 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్స్ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో భారత మూలాలున్న తన్వీర్ సంఘా (19) చోటు దక్కించుకున్నాడు.
తద్వారా పసుపు రంగు జెర్సీని ధరించిన నాల్గవ భారత సంతతి ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా తన్వీర్ రికార్డుల్లోకెక్కాడు.అంతకన్నా ముందు 2015లో భారత్‌పై ఆసీస్ తరపున ప్రాతినిధ్యం వహించిన గురీందర్ సంధూ పంజాబీ మూలాలున్న వ్యక్తి.
ఇక స్టువర్ట్ క్లార్క్, బ్రాన్స్‌బీ కూపర్లు సైతం భారతదేశంలోనే జన్మించారు.అయితే ఆస్ట్రేలియా క్రికెట్లో తన్వీర్ సంఘా ప్రయాణం మాత్రం సంచలనాత్మకం.ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ తరపున తన్వీర్ మంచి ఫామ్‌లో వున్నాడు.తొలి సీజన్లో 14 మ్యాచ్‌లలో 21 వికెట్లు పడగొట్టాడు.అతని లెగ్ స్పిన్ మాయాజాలానికి ప్రత్యర్ధులు వణుకుతున్నారు.అయితే ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ – 2020లో తన్వీర్ ప్రదర్శన నిరాశపరిచింది.
కానీ అత్యద్బుత ఆటతీరుతో సంఘా జాతీయ జట్టులో స్థానం సంపాదించడం విశేషం.సిడ్నీలో భారతీయ వలసదారుల ఇంట్లో జన్మించిన తన్వీర్ సంఘా .ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఫవాద్ అహ్మద్ దృష్టిని ఆకర్షించాడు.ఫాస్ట్ బౌలర్‌గా క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన తన్వీర్ టీనేజ్ సమయానికి లెగ్ స్పిన్నర్‌గా మారిపోయాడు.
సిడ్నీ క్లబ్ క్రికెట్లో అసమాన ప్రతిభ చూపిన తన్వీర్.రాష్ట్ర, అంతర్జాతీయ జట్లలోకి అనతికాలంలోనే స్థానం సంపాదించాడు.
క్లబ్ క్రికెట్లో అతని జోరు 2020 అండర్ 19 ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించేందుకు దోహదం చేసింది.జట్టులో అతను ఆస్ట్రేలియాకు తురుపుముక్కగా అవతరించాడు.ఆరు మ్యాచ్‌లలో తన్వీర్ 15 వికెట్లు తీశాడు.ఈ క్రమంలో రెండు సార్లు నాలుగు వికెట్లు తీసిన తన్వీర్… నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో 5/14తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
క్రైస్ట్ చర్చ్‌లో ఫిబ్రవరి 22 నుంచి ఆస్ట్రేలియా 5 ట్వంటీ 20 మ్యాచ్‌లు ఆడనుంది.డునెడిన్, ఆక్లాండ్, వెల్లింగ్టన్, మౌంట్ మౌంగనుయ్లలో తదుపరి మ్యాచ్‌లు జరగనున్నాయి.