ఇటీవలే రియాల్టీ షో బిగ్ బాస్ 4 సీజన్ పూర్తయిన సంగతి తెలిసిందే.అందులో పాల్గొన్న కంటెస్టెంట్ సోషల్ మీడియాలో తెగ అల్లరి చేయగా… ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో తన అందంతో ఆకట్టుకున్న దీవి… యువతల మనసును దోచుకుంది.అయితే బిగ్ బాస్ హౌస్ లో దెయ్యం ఉందని సంచలన విషయాలు తెలిపింది.
బిగ్ బాస్ హౌస్ లో తన అల్లర్లతో, అందంతో, మాటలతో….అందరినీ ఆకర్షించిన దివి ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ లో దెయ్యం ఉందని తెలిపింది.
బిగ్ బాస్ హౌస్ లో డోర్ దగ్గర గ్లాస్ ఉండేది.చాలా వరకు ఆ గ్లాస్ ఎవరికీ కనపడకపోయేసరికి చాలా మంది ఆ గ్లాస్ ను తగిలించుకున్నారు.
అంతేకాకుండా స్వాతి దీక్షిత్ కూడా ఆ గ్లాస్ తగలగా… తన ముఖానికి ఉన్న మేకప్ ఆ గ్లాస్ కు అంటుకుంది.దీంతో అది చూసి మేము చాలా నవ్వుకున్నాము.
అయితే రాత్రి సమయాన పడుకునే ముందు అకస్మాత్తుగా ఆ గ్లాస్ వైపు చూడగా దెయ్యం రూపంలో ఆ గ్లాస్ పై కనిపించింది.వెంటనే భయపడిపోయి చాలా ఏడ్చాను.ఏమి చేయలేక వెంటనే డాక్టర్ ను పిలిపించగా ఆయనే నాకు వైద్యం చేశాడు.ఆ మెడికల్ రూమ్ లోనే నాకు భయంతోవాంతులు కూడా అయ్యాయి.బయట ఉన్న వాళ్ళు దివి ఎక్కడికి వెళ్లిందని ఆందోళన చెందారని దివి తెలిపింది.పైగా ఈ దృశ్యాన్ని స్క్రీన్ పై చూపించలేదని తెలిపింది.
కాగా దివి బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళినప్పటి నుంచి ఫాలోయింగ్ పెంచుకుంది.వరుస సినిమా ఆఫర్లతో సిద్ధంగా ఉందని తెలుస్తుంది.మహర్షి సినిమాలో చిన్న పాత్రలో నటించిన దివి… ఆ సినిమా నుండి ఎవరికి తెలియ లేకపోయింది.కానీ బిగ్ బాస్ తర్వాత ఒక స్టార్ గా యువతలో పేరు సంపాదించుకుంది.
ప్రస్తుతం మూడు సినిమాలలో ఆఫర్లు రాగా… చిరంజీవి నటించే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా అవకాశం వచ్చింది.