టాలీవుడ్ లో ప్రతి జెనరేషన్ లో ఒక పవర్ ఫుల్ నటి తెరపై తన హవా కొనసాగిస్తూ వచ్చింది.అంజలీదేవి, సావిత్రి, వాణిశ్రీ, శ్రీదేవి, సౌందర్య, విజయశాంతి, అనుష్క లాంటి తారలు మిగిలిన హీరోయిన్లకి భిన్నంగా తమని తాము ప్రజెంట్ చేసుకొని సక్సెస్ ఫుల్ హీరోయిన్లు కావడంతో పాటు మహానటిమణులు అనిపించుకున్నారు.
వారి యాక్టింగ్ టాలెంట్ తో మామూలు సినిమాలని సైతం సూపర్ హిట్ చేశారు.ఈ కథానాయికలు వారు చేసిన పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి సినిమాకి ప్రాణం పోశారు.
అందుకే సౌత్ లో బెస్ట్ కథానాయికల పేర్లు చెబితే ఎక్కువగా వీరి పేర్లు వినిపిస్తాయి.ఈ జెనరేషన్ లో బెస్ట్ కథానాయికల జాబితాలోకి చేరే సత్తా ఉన్న అందాల భామలు ఇద్దరే ఉన్నారు.
వారే కీర్తి సురేష్, సాయి పల్లవి.ఈ ఇద్దరు భామలు రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్లకి భిన్నంగా కేవలం తన నటన టాలెంట్ తోనే తెరపై తమని తాము అద్భుతంగా ఆవిష్కరించుకొని అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.

కీర్తి సురేష్ నటిగా మహానటి సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకొని నేషనల్ అవార్డు గెలుచుకుంది.అయితే సాయి పల్లవి నేషనల్ అవార్డు గెలుచుకునే స్థాయిలో పాత్రలు చేయకపోయిన ఆమె నటించిన ప్రతి సినిమాలో కచ్చితంగా ఆమె పాత్ర అందరికి కనెక్ట్ అవుతుంది.ప్రేమమ్ సినిమాలో మలర్, ఫిదా సినిమాలో భానుమతి, మారీ2 సినిమాలో ఆటో రాణి పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసి పాత్రలు మాత్రమే తెరపై కనిపించే విధంగా చేసింది.కీర్తి సురేష్ తో పోల్చుకుంటే సాయి పల్లవికి ఎక్స్ ట్రా టాలెంట్ డాన్స్.
పెర్ఫార్మెన్స్ తో పాటు డాన్స్ లో కూడా సాయి పల్లవి ది బెస్ట్ అనిపించుకుంటుంది.ఈ కారణంగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం ఆమెకి రాకపోయిన, పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు అంటే ముందుగా సాయి పల్లవినే సంప్రదిస్తున్నారు.
ఈ కారణంగా సౌందర్య తర్వాత నటన, డాన్స్ ని ఈక్వల్ చేస్తూ ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే కథానాయికగా సాయి పల్లవి కనిపిస్తుంది.