స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో బన్నీ లుక్ అల్ట్రా రఫ్ లుక్‌లో కనిపించనున్నట్లు ఇప్పటికే ఆయన లుక్స్ సోషల్ మీడియాలో అదిరిపోయే క్రేజ్‌ను దక్కించుకున్నాయి.కాగా తాజాగా ఈ సినిమాలో బన్నీ ప్రేక్షకులకు ఓ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
పుష్ప చిత్రంలో బన్నీ చాలా స్లిమ్ అండ్ టైట్‌గా కనిపిస్తాడట.కాగా ఈ సినిమాలో బన్నీ సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేశాడని, ఓ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లో మనకు తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తాడని తెలుస్తోంది.
గతంలో దేశముదురు చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బన్నీ, ఇప్పుడు మరోసారి అలాంటి లుక్‌తో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాచ్‌లో లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.
కాగా ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా సుకుమార్ తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.
బన్నీ సరసన హీరోయిన్గా కన్నడ కుట్టి రష్మిక మందన నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆమె ఎలాంటి పాత్రలో నటిస్తుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తొలుత తమిళ నటుడు విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేసినా, కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి వాకౌట్ చేశాడు.మరి ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎవరు నటిస్తారనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.