చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్.బాలనటిగా పలు సినిమాల్లో నటించిన శృతి 2008లో లక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఆ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో పాటు శృతి యాక్టింగ్ పై క్రిటిక్స్ పెదవి విరిచారు.తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాతో శృతిహాసన్ హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించగా ఆ సినిమాకు సైతం ఫ్లాప్ టాక్ వచ్చింది.
తెలుగు, తమిళ భాషల్లో శృతిహాసన్ నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో శృతిహాసన్ పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది.అయితే పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శృతిహాసన్ దశ తిరిగింది.
ఆ సినిమా తరువాత శృతిహాసన్ తెలుగు, తమిళ భాషల్లో నటించిన సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.పవన్ తో కాటమరాయుడు సినిమాలో నటించిన శృతి హాసన్ మూడేళ్ల గ్యాప్ తరువాత వకీల్ సాబ్, క్రాక్ సినిమాల్లో నటిస్తోంది.
పింక్ రీమేక్ వకీల్ సాబ్ లో శృతిహాసన్ పాత్ర కొన్ని నిమిషాలకే పరిమితం అని తెలుస్తోంది.అయితే పాత్ర పరిధి చిన్నదైనా ఆమె సాధారణంగా సినిమాకు ఎంత తీసుకుంటారో ఈ సినిమాకు కూడా అంతే తీసుకుంటున్నారని సమాచారం.రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడనని శృతిహాసన్ నిర్మాతలకు చెప్పినట్టు తెలుస్తోంది.వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ లో శృతిహాసన్ పాల్గొనబోతుంది.నిజానికి పింక్ ఒరిజినల్ వెర్షన్ లో శృతిహాసన్ పాత్ర లేకపోయినా కమర్షియల్ హంగుల కోసం ఒక స్పెషల్ పాత్రను దర్శకుడు క్రియేట్ చేశారు.
దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నా పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా కావడంతో దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాను సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికే ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.