నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.కాగా ఈ సినిమా పూర్తికాక ముందే తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తూ నాని తన దూకుడు చూపిస్తున్నాడు.
టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింఘ రాయ్ అనే సినిమాలో నటించనున్న నాని, మరో సినిమాను క్యూలో పెట్టాడు.దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి.
’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తన నెక్ట్స్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశాడు నాని.
కాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను ఇటీవల అఫీషియల్‌గా రిలీజ్ చేయగా దానికి మంచి క్రేజ్ దక్కింది.
ఇక ఈ సినిమా కథ ఏమై ఉంటుందా అనే ఆసక్తి ఈ పోస్టర్‌ను చూస్తే కలగక మానదు.అయితే ఈ సినిమా కథ కామెడీ జోనర్‌కు చెందిందని, ఇందులో నాని తన ఇంటిని హీరోయిన్ నజ్రియా కుటుంబానికి అద్దెకిస్తాడని, వారు బ్రాహ్మణులమని చెప్పి ఇంట్లో అద్దెకు దిగుతారని, అక్కడి నుండి సినిమా కథ ఎలా ముందుకు సాగుతుందనేది ఈ సినిమా కాన్సెప్ట్ అని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఏదేమైనా మరోసారి కామెడీ జోనర్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించేందుకు నాని రెడీ అవుతున్నట్లు ఈ సినిమా యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని నాని అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమా కంటే ముందే శ్యామ్ సింఘ రాయ్ చిత్రాన్ని పూర్తి చేయాలని నాని భావిస్తున్నాడు.ఇక శ్యామ్ సింఘ రాయ్ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.