తన అందచందాలతో అందరినీ కట్టిపడేస్తూ తలుక్కుమంటున్న భామ రకుల్ ప్రీత్ సింగ్.అందాల ఆరబోతలోనూ, తన నటనతోనూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
అయితే ముద్దుగుమ్మ తన నటనతో, అందచందాలతో అగ్ర హీరోయిన్ల జతన చేరింది. కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నదానికి ఆ తరువాత సినిమాలు క్యూ కట్టాయనే చెప్పుకోవచ్చు.
చాలా సినిమా ల్లో ఈ బ్యూటీ నటించి మంచి క్రేజ్ నే సంపాదించుకున్నా.కొన్ని సినిమాలు మాత్రం ఆమెకు అనుకున్న గుర్తింపును ఇవ్వలేక పోయాయి.దాంతో ఈ ముద్దుగుమ్మ సినిమాల ఎంపికలో కేర్ ఫుల్ గా వ్యవహరిస్తోందని తెలుస్తోంది.కాగా రీసెంట్ గా ఈ చిన్నదానికి సినిమా చాన్స్ లు ఎక్కువగా రావడంలేదని తెలుస్తోంది.
అయితే ఈ బ్యూటీ కి డ్రగ్స్ కేసులో సంబంధముందని వార్తలు వచ్చాయి.
కాగా ఆ విషయం పై రకుల్ ను అధికారులు కూడా విచారించిన విషయం తెలిసిందే.అయితే ఈ బ్యూటీ కి చాలా తక్కువ సినిమాలు తన చేతిలో ఉన్నట్టు తెలస్తోంది.అయితే రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మకు భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
వివరాళ్లోకి వెళితే.బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సినిమాలో నటించడానికి ఆఫర్ వచ్చింది.
అయితే అమితా బచ్చన్ ప్రధాన పాత్రలో నటించనున్న సినిమా ‘మేడే’.
ఈ చిత్రానికి స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది.ఈ చిత్రంలో అమితాబచ్చన్, అజయ్ దేవ్ గన్ పనిచేయనున్నారు.కాగా ఈ చిత్రంలో మరొక ముఖ్యమైన పాత్రను పోషించడానికి రకుల్ ప్రీత్ సింగ్ నటించడానికి అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.
అయితే ఈ మూవీలో రకుల్ అకుల్ కో పైలట్ పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది.