రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అలుముకున్న జల వివాదం ఒక కొలిక్కి వస్తుందని అంతా ఇప్పటి వరకు ఆశాభావంతో ఉన్నారు.దీనికి కారణం ఏపీ ప్రభుత్వంతో తాను ఎటువంటి తగాదా పెట్టుకోదలుచుకోలేదని, రెండు రాష్ట్రాలు ఎటువంటి వివాదం లేకుండా సమస్యను పరిష్కరించుకుంటామంటూ కొద్ది రోజుల క్రితమే జగన్ ప్రకటించారు.
గోదావరి జలాలు వృధాగా సముద్రం పాలవుతున్నాయి కాబట్టి రెండు రాష్ట్రాలు సక్రమంగా గోదావరి జలాలను వినియోగించుకుంటామంటూ గతంలోనే కేసీఆర్ జగన్ కలిసి నిర్వహించిన సమావేశంలో తీర్మానించుకున్నారు.సామరస్యపూర్వకంగా రైతుల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించారు.
కానీ అకస్మాత్తుగా ఏపీ సీఎం జగన్ కృష్ణా జలాలకు సంబంధించి జీవో నెంబర్ 203 విడుదల చేయడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగింది.

ఈ విషయంలో కేసీఆర్ కాస్త సానుకూలంగానే ఉన్నా, మిగతా రాజకీయ పార్టీలు పోతిరెడ్డిపాడు అంశాన్ని బాగా హైలెట్ చేసుకుని కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శలు మొదలుపెట్టాయి.ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేశారు.ఇదిలా ఉంటే జగన్ మాత్రం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తు పెంచడంతోపాటు, దీనికి సంబంధించిన కాలువల విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు.
దీనిపై టిఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది అన్న విషయాన్ని గ్రహించిన కేసీఆర్ పోతిరెడ్డిపాడు ను వ్యతిరేకిస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు.అలాగే పూర్తిగా ఉనికి కోల్పోయిందనుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయాన్ని హైలెట్ చేసుకుంటోంది.

ఈ అంశంతో కాంగ్రెస్ పుంజుకునేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టింది.దీంతో ప్రభుత్వంపైనా విమర్శలు పెరిగిపోవడంతో కేసీఆర్ తెలంగాణ లో కృష్ణా నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా జూరాల దగ్గర కొత్త ప్రాజెక్టు నిర్మించాలని, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అలాగే దమ్ముగూడెం వద్ద ప్రాజెక్టు ఎత్తు పెంచి ఏపీ ప్రభుత్వం భావిస్తున్న పోతిరెడ్డిపాడు కు చెక్ పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.అయితే ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని జలరంగ నిపుణులు సూచించడంతో కెసిఆర్ ఆలోచనలో పడ్డారట.
ఏపీని దెబ్బ కొట్టే విధంగా జూరాల దగ్గర కొత్త ప్రాజెక్టు గోదావరి మీద ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వద్ద మరో ప్రాజెక్టును నిర్మించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.అది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.