టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.
ఇక ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
అయితే ఈ సినిమా తరువాత తారక్ మరికొంతమంది దర్శకులను లైన్‌లో పెట్టాడు.
అయితే వారిలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, తమిళ దర్శకులు అట్లీ, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఉన్నట్లు తెలుస్తోంది.కాగా వీరిలో తారక్ తన నెక్ట్స్ మూవీని తెలుగు దర్శకుడితో కాకుండా ఇతర భాష డైరెక్టర్‌తో తీయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అట్లీకి మంచి మాస్ ఫాలోయింగ్ ఉండటంతో అతడు తెరకెక్కించే చిత్రంలో తారక్ నటించే అవకాశం ఉందంటూ ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అటు ప్రశాంత్ నీల్ కూడా పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ కథతో తారక్‌ను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడ.
అంటే తారక్ తదుపరి చిత్రం ఖచ్చితంగా ఇతర భాషా దర్శకుడితో ఉండటం ఖాయమని తెలుస్తోంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే తారక్ తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.