అమెరికాలో వైద్యుల నిర్లక్ష్యం...కరోనాకి బలైన అమెరికా డిటెక్టివ్..!!

అమెరికాలో కరోనా చేస్తున్న కరాల నృత్యానికి సుమారు 22 వేల మంది మృతి చెందారు.దాదాపు 5.55 లక్షల మంది ప్రజలు కరోనా బారినపడి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు.అమెరికా వ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి అయితే.

 American Lady Detective, Armer Died, Corona, Coronavirus, Marylou Armer, Califor-TeluguStop.com

ఒకవైపు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అమెరికాలో ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నారని, కరోనా పరీక్షలు చేయమన్నా డాక్టర్లు చేయడం లేదని వాపోతున్నారు అమెరికన్లు.ఈ క్రమంలోనే తాజాగా డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ సీనియర్ డిటెక్టివ్ మృతి చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఆర్మర్ అనే మహిళ డిటెక్టివ్ కరోనా పరీక్షలు చేయమని రెండుసార్లు ఆస్పత్రికి వెళ్లినా డాక్టర్లు ఆమెకు కరోనా లక్షణాలపై అవగాహన లేకుండా వచ్చారని ఆమె కరోనా లేదని డాక్టర్లు పరీక్షలు నిర్వహించలేదు.దాంతో కొన్ని రోజుల తర్వాత ఆమె భర్త వైద్యులతో ఘర్షణకు దిగడంతో పరీక్షలు నిర్వహించారు.

ఈ సమయంలో ఆమెకు కరోనా పాజిటివ్ ఉందని తేలడంతో షాక్ అయిన వైద్యులు అప్పటికే చేయి దాటిందని ప్రకటించారు వైద్యం తీసుకుంటూనే ఆమె ఆస్పత్రిలోనే మృతి చెందింది.

Telugu Americanlady, Corona, Coronavirus, Marylou-

ఆర్మర్ కు మొదట్లో ఫ్లూ వచ్చిందని అనుకున్నామని ఊపిరి తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడిందని ఈ కారణంగా ఆస్పత్రికి వెళ్లినా వైద్యులు పట్టించుకోక పోవడం వల్లనే నా సోదరి మరణించిందని ఆర్మర్ సోదరి బోరున విలపించింది.అమెరికాలో ప్రజలని వైద్యులు సరిగా పట్టించుకోవడం లేదని అందుకు నిదర్శనం నా సోదరి మృతని తెలిపింది.ఒక డిటెక్టివ్ కి ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ఆమె వైద్యులపై మండిపడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube