నార్త్ ఇండియా నుంచి వచ్చిన అందాల భామలు తెలుగు సినిమాతో ఎక్కువగా స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతూ ఉంటారు.ఇక్క స్టార్ హీరోలతో అవకాశాలు అందిపుచ్చుకొని కమర్షియల్ హిట్స్ కొట్టి స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత మెల్లగా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తారు.
అయితే కొంత మందికి అక్కడ సక్సెస్ వరిస్తుంది.కొంత మంది మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేరు.
అలాగే మంగళూరు నుంచి వచ్చిన భామలు కూడా తెలుగులో సక్సెస్ కొట్టి బాలీవుడ్ బాట పడుతూ ఉంటారు.అయితే ఈ భామలు తెలుగు సినిమాలు చేస్తున్నంత వరకు తెలుగు ప్రేక్షకులే మాకు ఎక్కువ.
తెలుగు సినిమాలకే తమ మొదటి ప్రాధాన్యత అని చెబుతూ ఉంటారు.
అయితే ఒక్కసారి బాలీవుడ్ లో అవకాశాలు అందుకున్న తర్వాత వారి స్వరం మారిపోతుంది.
తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్స్ గ్లామర్ తప్ప నటన అవసరం లేదు.దర్శకులు కూడా హీరోయిన్స్ ఎంత అద్భుతంగా నటన చేస్తుంది అనేది అస్సలు చూడరు.
ఎంత ఎక్స్ పోజింగ్ చేస్తుంది.గ్లామర్ షో చేయడానికి ఎంత వరకు కోపరేట్ చేస్తుంది అనే విషయాలనే చూస్తారు అంటూ విమర్శలు చేస్తూ ఉంటారు.
ఈ వరుసలో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయ్యి బాలీవుడ్ కి వెళ్ళిన ఇలియానా అయిన మొన్నటికి మొన్న తాప్సి అయిన, రాధిక ఆప్టే లాంటి భామ అయిన అందరిని ఒకాటే మాట.ఇక్కడ సినిమాలు చేస్తే తెలుగు సినిమాలు అంటే ఇష్టం, బాలీవుడ్ కి వెళ్తే తెలుగు తెలుగు ప్రేక్షకులకి టేస్ట్ లేదు అనే మాటలు చెబుతూ ఉంటారు.ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా అదే దారిలో చేరిపోతుంది.ఆమె లాగే పూజా హెగ్డే కూడా చేరే అవకాశం కనిపిస్తుంది.ఈ ఇద్దరు భామలు తెలుగులో స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు బాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటున్నారు.ప్రస్తుతానికి తెలుగు సినిమాలకి వీరు కొంత ప్రాధాన్యత ఇస్తున్న ఎక్కువగా బాలీవుడ్ వైపే చూస్తున్నారు.
అక్కడ సక్సెస్ అయితే వీరి స్వరం కూడా మారిపోయే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.