షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ ప్రారంభించి మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి వివేక్ ఆత్రేయ, ఇక ఈ దర్శకుడు తన రెండో సినిమాని కూడా శ్రీవిష్ణుతోనే బ్రోచేవారెవరురా అని తీసాడు.ఈ రెండు సినిమాలు డిఫరెంట్ కంటెంట్ తో యూత్ కి కనెక్ట్ అయ్యే పాయింట్స్ తో వచ్చాయి.
లో బడ్జెట్ సినిమాలు కావడం కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడంతో సక్సెస్ అయిన కూడా పెద్దగా కలెక్షన్స్ రాలేదు.అయితే ఇప్పుడు ఈ దర్శకుడు మూడో సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ లో చేయడానికి ఒకే చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాని నేచురల్ స్టార్ నానితో తీయాలని వివేక్ ఆత్రేయ ప్లాన్ చేసుకున్నాడు.ఇక నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, వి సినిమా తర్వాత అది సెట్స్ పైకి వెళ్తుంది అని టాక్ కూడా వినిపించింది.
అయితే ఇప్పుడు ఈ స్టొరీతో వివేక్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.స్టార్ హీరోగా ఉన్న నాని స్టైల్ లో వివేక్ చెప్పిన కథ సెట్ కాకపోవడంతో అతను చేయడానికి ఆసక్తి చూపించలేదనే టాక్ వినిపిస్తుంది.
ఈ నేపధ్యంలోనే యూత్ కంటెంట్ కథలతో ఎక్కువగా సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకి వివేక్ ఆత్రేయ కథ చెప్పి ఒకే చేయించుకున్నాడని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో విజయ్ దేవరకొండ పూరీ సినిమా పూర్తి చేసిన వెంటనే వివేక్ చెప్పిన కథని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.