శ్రీదేవిని గుర్తుచేయడమే నా డ్రీం రోల్! పాయల్ పెద్ద కోరిక

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి క్రేజీ హీరోయిన్ గా మారిన భామ.పంజాబ్ నుంచి వలస వచ్చిన ఈ భామ మొదటి సినిమాలో చేసిన బోల్డ్, నెగిటివ్ పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

 Payal Rajput Dream Role Become A Act In Sridevi Role In Biopic-TeluguStop.com

దీంతో ఇక టాలీవుడ్ లో పాయల్ రాజ్ పుత్ స్టార్ హీరోయిన్ అయిపోవడం పక్కా అని అందరూ భావించారు.వెంకటేష్, రవితేజ లాంటి స్టార్స్ తో వరుసగా సినిమాలు చేసే అవకాశం పాయల్ సొంతం చేసుకుంది.

అయితే దర్శకులు ఈమెలోని గ్లామర్ ని చూపించడానికి ప్రయత్నించారు తప్ప నటిని గుర్తించలేదు.దీంతో ఆ సినిమాలు చేసిన కూడా పాయల్ కి అనుకున్న స్థాయిలో బ్రేక్ రాలేదు.

ఇప్పుడు తెలుగులో ఒకటి అర సినిమాలలో నటిస్తుంది.అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేసే ఈ భామ అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అందాల విందు ఇస్తుంది.

అలాగే అప్పుడప్పుడు పేస్ బుక్ లో అభిమానులతో చాటింగ్ చేస్తూ వారు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెబుతుంది.ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి ఆమె ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది.

బికినీ తనకి కంఫర్ట్ అనిపిస్తే వేస్తానని లేదంటే వేయనని చెప్పిన పాయల్ ఇప్పట్లో బికినీ వేసుకోవాలనే ఆలోచన లేదని తేల్చి చెప్పేసింది.ఒక వేళ తాను నటిని కాకుంటే న్యూస్ యాంకర్ అయ్యేదానిని అని చెప్పింది.

అలాగే అవకాశం వస్తే తనకి శ్రీదేవి బయోపిక్ లో నటించాలని ఉందని, అదే తన డ్రీం రోల్ అని చెప్పుకొచ్చింది.మొత్తానికి పాయల్ కోరిక పెద్దదే అయిన ఆమె క్రేజ్ మాత్రం ఆ స్థాయిలో లేదని చెప్పాలి.

మరి ఆ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube