వికీ లీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే ను ఇటీవల బ్రిటీష్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే లైంగిక వేధింపుల కేసు కు సంబంధించి విచారించడానికి వీలుగా అసాంజే ను తమకు అప్పగించాలి అంటూ తాజాగా స్వీడన్ ప్రభుత్వం బ్రిటన్ కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది.
అయితే రహస్య పత్రాల వెల్లడి కేసులో ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంది.అయితే ఇప్పుడు స్వీడన్ ప్రభుత్వం అతడ్ని తమకు అప్పగించాలి అని కోరగా అమెరికా ఏవిధంగా అడుగులు వేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
ఏడేళ్ల ప్రవాస జీవితం గడిపిఎం అసాంజే ను గత నెల లో ఈక్వెడార్ దౌత్య కార్యాలయం లో బ్రిటన్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం ఒక కేసులో 50 వారల జైలు శిక్ష ఎదుర్కొంటున్న అసాంజే ప్రస్తుతం బ్రిటన్ లో జైలు లో ఉన్నారు.

అయితే ఇప్పుడు బ్రిటన్ నుంచి తమకు అసాంజే ను అప్పగించాలి అంటూ స్వీడన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.స్వీడిష్ ప్రాసిక్యూటర్ జనరల్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ అసాంజేపై యూరోపియన్ అరెస్ట్ వారంట్ జారీ చేస్తామని, ఆయన బ్రిటన్ నుండి తమదేశానికి చేరినవెంటనే అరెస్ట్ చేసి కేసు విచారణ ప్రారంభిస్తామని తెలిపారు.లైంగిక వేధింపుల కేసును పునరుద్ధరించాలన్న స్వీడన్ ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో రహస్య పత్రాల వెల్లడి కేసులో ఆయనను అమెరికాకు అప్పగిస్తారా లేక స్వీడన్ కు పంపుతారా అన్న అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.అయితే మరొపక్కక అసాంజెపై అత్యాచార కేసును తిరగదోడడం రాజకీయంగా తప్పుదారి పట్టించేదిగా ఉందంటూ వికీలీక్స్ చీఫ్ ఎడిటర్ కిర్ స్టీన్ హ్రాఫసన్ తెలిపారు.