కార్తి హీరోగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషలలో కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం దేవ్.రిలీజ్ ముందు సినిమా మీద మంచి అంచనాలు వున్న, రిలీజ్ తర్వాత ఊహించని విధంగా దీనికి ఎవరేజ్ టాక్ వచ్చింది.
తెలుగులో అయితే ఇంచుమించు ఫ్లాప్ టాక్ తో నడుస్తుంది.సినిమా కంటెంట్ భాగానే వున్నా లెంత్ ఎక్కువైందనే టాక్ వుండటంతో పాటు, అనవసరమైన సన్నివేశాలు దేవ్ సినిమాలో ఎక్కువగా వున్నాయని, కొత్తగా స్టార్ట్ చేసి రొటీన్ గా కథనం నడిపించచర్యలు డని దర్శకుడు మీద నెగిటివ్ టాక్ వచ్చింది.
ఈ నేపధ్యంలో చిత్ర దర్శకుడు దేవ్ సినిమా దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాడు.
తాజాగా ఈ సినిమాని ట్రిమ్ చేసిన దర్శకుడు సినిమాలో ఏకంగా 15 నిమషాల నిడివి ఫుటేజ్ ని తొలగించి, కొత్త ఫ్రింట్ ని మరల థియేటర్స్ కి పంపిస్తున్నట్లు తెలుస్తుంది.
మరి ఇప్పటికే ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ట్రిమ్ చేసిన తర్వాత అయిన వర్క్ చేసిన తర్వాత పోజిటివ్ టాక్ తెచ్చుకున్తుందా అనేది చెప్పలేం.అయితే సినిమాలో కార్తి మొదటి సారి కొత్త లుక్ తో కనిపించడంతో తమిళనాట సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వుంది.
మరి ట్రిప్ ఫుటేజ్ తో దర్శకుడు ఆడియన్స్ ని మెప్పించగలడో లేదో చూడాలి.