దశాబ్దాల…చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏపీలో పెద్ద చిక్కొచ్చి పడింది.చెప్పుకోవాడినికి జాతీయ పార్టీ అయినా… ఇందులో పేరుమోసిన బడా నాయకులు ఉన్నా… ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇక్కడ గెలుచుకునే పరిస్థితి కనిపించడంలేదు.
దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి పరువు పోగొట్టుకోవాల్సిందేనా అని నాయకులు మధనపడుతున్నారు.తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందుకు వెళ్లిన కాంగ్రెస్ అక్కడ చేదు ఫలితాన్ని చవిచూడడంతో ఇక్కడ ఏం చెయ్యాలి అనే విషయంలో ఆలోచనలో పడింది.
ఈ నేపథ్యంలోనే ఏపీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్లాలని డిసైడ్ అయ్యారు.అసలు పొత్తు ఉంటేనే అంతంత మాత్రమే పరిస్థితి అనుకుంటుంటే… ఇక సొంతంగా ఎన్నికల బరిలోకి వెళ్లడమా అని ఒక ప్రత్యామ్న్యాన్ని ఇప్పుడు ఆలోచించారు.
తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశామని కాంగ్రెస్ అధిష్టానం ఆలస్యంగా తెలుసుకుంది.దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోకూడదని… నిర్ణయించుకుంది.తెలంగాణ ముందస్తు ఎన్నికలతో చంద్రబాబు మీద తీవ్ర వ్యతిరేకత వస్తోందని గ్రహించిన కాంగ్రెస్ …ఏపీలో కూడా అదే పరిస్థితి ఉందని అంచనా వేసింది.దీంతో జాతీయ స్థాయిలో చంద్రబాబుతో స్నేహం చేయాలని ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆయనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే పార్టీ సీనియర్లు మాత్రం చంద్రబాబు నాయుడు కంటే వైసీపీ అధ్యక్షుడు జగన్ తో స్నేహం చేస్తే కలిసి వస్తుందని అంటున్నారు.చింతా మోహన్ వంటి సీనియర్ నాయకులు.
అంతే కాదు… వైసీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పిస్తానని బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు.గన్ తో స్నేహం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని , అంతే కాకుండా… జగన్ తమ పాత నాయకుడే కాబట్టి ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రాదని చింతామోహన్ లెక్కలు చెబుతున్నాడు.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ముందే ప్రకటించారు.ఇదే నినాదాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా ప్రచారం చేస్తే పార్టీకి మేలు చేకూరుతుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇవన్నీ కేవలం ప్రతిపాదనలు దగ్గరే ఉన్నాయని.వీటిపై పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేనిదని ఆ పార్టీ సీనియర్ నాయకులు మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.