టాలీవుడ్‌లో తానో రాజమౌళి స్థాయి దర్శకుడిని అని, ఒక మాటలో చెప్పాలంటే రాజమౌళి కంటే నేనే గొప్ప దర్శకుడిని అనుకునే వ్యక్తి గుణశేఖర్.ప్రతిభ ఉన్నా కూడా కాస్త అతి చేస్తాడనే కారణంగా ఈయనపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి.
సినిమా స్థాయిని, తన స్థాయిని, బిజినెస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈయన ఎప్పుడు సినిమాు చేయడు.ఈయన చేసిన ఎక్కువ సినిమాలు సక్సెస్ అయినా కూడా భారీ బడ్జెట్ కారణంగా నిర్మాతలకు అంతగా లాభాలు తీసుకు రాలేదని చెప్పాలి.

ఈయన కొన్ని సంవత్సరాల క్రితం ‘రుద్రమదేవి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో ఆ సినిమాను రూపొందించాడు.హీరోయిన్ ఓరియంటెడ్ మూవీకి అంత బడ్జెట్ వద్దని ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోలేదు.50 కోట్లతో నిర్మిస్తే నిర్మాతగా, దర్శకుడిగా గుణశేఖర్ లాభపడేవాడు.కాని రుద్రమదేవి చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించి నష్టపోయాడు.ఇప్పుడు ఈయన ‘హిరణ్యకశిప’ అనే చిత్రాన్ని తెరకెక్కించాలని స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నాడు.

ఈ చిత్రాన్ని చేసేందుకు రానా, నిర్మించేందుకు సురేష్‌బాబులు ముందుకు వచ్చారు.తన స్థాయిని పెద్దగా ఊహించుకుని ఏకంగా 200 కోట్లు ఖర్చు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నాడు.గుణశేఖర్ స్థాయికి 50 కోట్ల వరకు అయితే రాబట్టగలడు.సరే కాన్సెప్ట్ భారీ బడ్జెట్‌ను డిమాండ్ చేస్తుంది కనుక 100 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చు.కాని 200 కోట్లు ఏంటీ గుణా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.గుణపై నమ్మకంతో సురేష్‌బాబు కూడా 200 కోట్లకు ఓకే చెప్పాడు.
సినీ వర్గాల్లో గుసగుసల ప్రకారం ఈ చిత్రం కోసం పెట్టబోతున్న అదనపు 100 కోట్లు గంగ పాలే అంటున్నారు.ఏదైనా అద్బుతం జరిగితే తప్ప 200 కోట్లు వెనక్కు రావడం కష్టం.