అమెరికాలో పౌరసత్వం పేరు వినగానే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఒక్క సారిగా ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది ట్రంప్ వచ్చిన తరువాత నుంచీ అసలు పౌరసత్వం పై ఆశలు వదిలేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది.ఒక పక్క ట్రంప్ విధించిన ఆక్షలు.
అమెరికా వలస జీవులకి అందని దాక్షలా మారిపోయింది పౌరసత్వం.అయితే ఈ విధానాలతోనే ట్రంప్ అమెరికా మధ్యంతర ఎన్నికల్లో దిగడం చావు దెబ్బ తినడం కూడా జరిగిపోయింది.
అయితే ఈ క్రమంలో అనూహ్యంగా మధ్యంతర ఎన్నికలు జరిగిన రోజునే 106 ఏళ్ల వయసున్న ఓ బామ్మకు అమెరికా పౌరసత్వం వచ్చింది.సల్వాడార్కు చెందిన మారియా వాల్లెస్ బొనిల్లా అనే బామ్మకు ఈ పౌరసత్వం దక్కింది…ఆమె చట్టపరంగా ఈ హక్కుని పొందటానికి అన్ని విధాలా అర్హులని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.అయితే పౌరసత్వం జారీకి ముందు అధికారులు ఆమెను ఇంటర్వ్యూ చేశారు.
పలు విధాలుగా ఆమెని విచారించిన తరువాత పౌరసత్వం జారీ చేశారు.దీంతో మారియా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.చనిపోయిన భర్త కల నెరవేరడంతో ఉధ్వేగానికి లోనయ్యింది .మనువళ్లు, కుటుంబ సభ్యులతో తన ఆనందాన్ని పంచుకుంది.అమెరికా జాతీయ పతాకాన్ని చేతితో పట్టుకుని ఛాతి మీద చేయి వేసి సంతోషాన్ని తెలిపింది.ఇప్పుడు ఈ వార్త అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది.
2 Attachments