పోలీస్ అంటే ఇలా ఉండాలిరా అనిపించేలా ప్రజలందరిలో గుర్తింపు పొందిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం రాజకీయాల్లోకి దిగేందుకు తహతహలాడుతున్నాడు.ఈ మేరకు గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసుకుంటూ ప్రజల్లో గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు.
గ్రామాల్లో యువత, రైతులు, మేధావులు ఇలా అందరిని కలుస్తూ ఒకరకమైన సానుకూల వాతావరణం ఏర్పరుచుకుంటున్నాడు.ఇక ఇప్పుడు రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చేలా యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.
దీనిలో భాగంగానే అగ్రిమెంట్ రాజకీయాలకు ఆయన తెరలేపాడు.
ఓట్ల కోసం వచ్చే నేతల వద్ద.
సమస్యలను పరిష్కరిస్తామనే హామీతో.బాండ్లు తీసుకోవాలంటూ యువతకు హితబోధ చేస్తున్నాడు లక్ష్మీనారాయణ.
రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలని , ప్రజలే మేనిఫెస్టో రూపొందించాలని సూచిస్తున్నారు.కొత్త ఆలోచనలు రేకెత్తించాలని తన పర్యటనల్లో చెబుతూ వస్తున్నారు.
గ్రామస్థాయి నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు మొదలు పెట్టారు.యువత ముందుకొచ్చి తమగ్రామాల్లో ఎలాంటి అవసరాలు కావాలో మేనిఫెస్టో రూపొందించాలని చెబుతున్నారు.
నాయకుల మెడలు వంచి పనులు చేయించుకోవాలంటున్నారు.వందరూపాయల బాండ్‌పేపర్‌లో అగ్రిమెంట్ రాయించుకోవాలని యువతను కోరుతున్నారు.జిల్లాల పర్యటనలు చేస్తున్న లక్ష్మీనారాయణ .మేనిఫెస్టోలు ప్రజలు ఎలా రూపొందించాలో తర్ఫీదు ఇస్తున్నారు.నకలు కాపీలను ప్రజలకు పంచి తమ అవసరాలను రాయాలని కోరుతున్నారు.
తన పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతోంది, ఏ పార్టీ నుంచి ఉండబోతోంది అనే విషయాల మీద క్లారిటీ ఇవ్వకుండా .తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ.ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని.
పరిష్కరించకపోతే ఉద్యమ బాట పడుతానంటున్నారు.రాజకీయాల గురించి అప్పుడే నిర్ణయం తీసుకుంటానంటున్నారు.
అయితే ఇప్పటికే ఆయన ఒక జాతీయ పార్టీ నుంచి సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం కూడా సాగుతోంది.అలాగే పవన్ జనసేనలో కూడా ఆయన చేరబోతున్నట్టు చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
కానీ ఆయన మాత్రం ఏ విషయంలోనూ సరైన క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు.మరి కొంత కాలం వేచి చూద్దాం అనే ధోరణి ఆయనలో కనిపిస్తోంది.