భారత సంతతి వ్యక్తి అరుదైన ఘనత

మేధోసంపత్తి.విషయపరిజ్ఞానం.

 Indian Origin Professor Chandra Mohan Invents 50 Protein Bio Makers-TeluguStop.com

ఆలోచనా ఫటిమ ఇవన్నీ భారతీయులకి తరతరాల నుంచీ వస్తున్న విలువైన సంపదలు.ఈ నాడు ఉన్నతమైన భవిష్యత్తు కోసం దేశం కాని దేశం విడిచి తమ ప్రతిభని విదేశాలలో చాటి చూపిస్తూ అంచెలంచెలుగా ఎంతో మంది భారతీయులు విదేశాలలో భారతీయుల ప్రతిభని చాటి చెప్తున్నారు.

ఈ క్రమంలోనే అమెరికాలాంటి అగ్ర రాజ్యంలో వెలుగు చూసిన ఎన్నో ప్రయోగాలు కానీ మరెన్నో అధునాతన సాంకేతికత లో కానీ భారతీయుల కష్టం దాగి ఉందని చెప్పడంలో సందేహం లేదు.అయితే

ఈ మధ్యకాలంలోనే ఎన్నో ఏళ్ల క్రితమే అమెరికా వెళ్ళిపోయి అక్కడ పౌరసత్వం పొంది భారత సంతతి వ్యక్తులుగా ఉంటున్న వారు ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటుతున్నారు.వివిధ శాఖలలో భారతీయులని కూడా తీసుకోవడం మన ప్రతిభకి గుర్తింపుగా చెప్పుకోవచ్చు…అయితే తాజాగా భారత సంతతి వ్యక్తి అయిన చందర్ మోహన్ అమెరికాలో పెద్ద శాస్త్రవేత్తగా పేరొందారు.

ఈయన పేగు వ్యాధి(ఐబీడీ)కి దారితీస్తున్న 50 ప్రొటీన్‌ బయోమేకర్స్‌ను కనుగొన్నారు.

దీనివల్ల అతిసారం, కడుపు తిప్పడం, బరువు తగ్గడం వంటి వ్యాధులకు కారణాలు తెలుసుకోవచ్చునని యూనివర్సిటీ ఆఫ్‌ హోస్టన్‌లో ప్రొఫెసరుగా ఉన్న చందర్‌ తెలిపారు.వాస్తవానికి ఈ వ్యాధిని గుర్తించాలంటే ఎండోస్కోపీ విధానంలో జీర్ణవ్యవస్థ దగ్గర భాగాలను సేకరించి బయాప్సీకి పంపుతారు…కానీ అలాంటి ఇబ్బందికరమైన పరీక్షలు లేకుండానే రుగ్మత గురించి తెలుసుకోవచ్చునని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube