గత ఎన్నిఅలా ముందు కాంగ్రెస్ పార్టీ తో విభేదించి సొంతంగా సమైక్యాంధ్ర పార్టీ పెట్టి చెప్పు గుర్తుతో ప్రజల్లోకి వెళ్లి .ఆ తరువాత అడ్రస్ గల్లంతు అయిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరిపోయారు.
కిరణ్ కు ఏపీలో పాపులారిటీ లేకపోయినా ఆయనే మా హీరో అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది.ఏపీలో పునర్వైభవం కోసం తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి కిరణ్ నిజంగా మైలేజ్ తీసుకువస్తాడా.? అసలు కిరణ్ బలం ఎంత బలగం ఎంత అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరో ఒకరు ముందుండి పార్టీలను నడపాలి కనుక ఆ బాధ్యత కూడా కిరణ్ నెట్టి మీదే పెట్టేందుకు అధిష్టానం చూస్తోంది.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం తహతహలాడుతోంది.అందుకే ముందుగా.ఓ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది.ఆ సభలోనే.
కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర, పార్టీలో ఆయన ప్రాధాన్యత, ఆయనకు ఇవ్వబోతున్న పదవి.ఇవన్నీ తేలబోతున్నాయి.
రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ చేపడుతున్న అతిపెద్ద కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తారట.! ఇది కిరణ్ కుమార్ నేతృత్వంలోనే జరుగుతుందని సమాచారం!
![](https://TeluguStop.com/wp-content/uploads/2018/07/Nallari-Kiran-Kumar-Reddy-back-in-Congress-.jpg)
ఈ సభలో ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీలు వంటివి ప్రధానంగా ప్రస్థావిస్తారు.ఆంధ్రాకు జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే కాంగ్రెస్ ద్వారానే సాధ్యం, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో అధికారం వస్తే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే.ప్రత్యేక హోదా ప్రకటనతోపాటు ఆంధ్రా సమస్యలన్నీ తీర్చేస్తామనే ప్రకటనలు ఆ బహిరంగ సభద్వారా ప్రకటించి ఏపీలో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది.
వీటితో పాటు భారీ స్థాయిలో నాయకులను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది.ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోయినా నేతలతో పాటు పక్క పార్టీల వారిని కూడా కాంగ్రెస్ గూటికి చేర్చేలా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టాలని చూస్తోంది.
టీడీపీ, వైసీపీలో అసంతృప్త నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని.పార్టీలోకి ఆహ్వానించాలనే వ్యూహాన్ని ఏఐసీసీ సిద్ధం చేసిందని తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ వ్యూహాలైతే బాగానే సిద్ధం చేసుకుంటుంది కానీ ఏపీలో పార్టీకి అంత సీన్ ఉందా .?
.