లోకేష్ సీఎం అభ్యర్ధిగా ఉండాలి అనే డిమాండ్ మహానాడు సాక్షిగా వినిపిస్తోంది.ముందు నుంచీ ఈ డిమాండ్ వస్తున్నా సరే గత కొంతకాలంగా ఏపీలో జరుగుతున్న పరిణామాల కారణంగా ఎక్కడా మళ్ళీ లోకేష్ సీఎం డిమాండ్ వినిపించలేదు.
అయితే మళ్ళీ అనూహ్యంగా ఈ డిమాండ్ మహానాడు వేదికగా చంద్రబాబు సాక్షిగానే మళ్ళీ తెరపైకి వచ్చింది.లోకేష్ నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
అయితే మహానాడులో ప్రసంగించిన జేసీ వ్యాఖ్యలు సైతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కాక పుట్టిస్తున్నాయి.ఏ లోకేష్ ఇంకా ఎదురు చూడాలా… ఇంకా మీరే చంద్రబాబే సీఎం గా ఉండాలా అని నేతలు గళం విప్పారు.అయితే ఈ వ్యాఖ్యలు ఎక్కడో చేయలేదు సాక్షాత్తు చంద్రబాబు ముందే చేశారు.సూటిగా సుత్తి లేకుండా ఉన్నది తాను అనుకున్నది అనుకున్నట్లు జేసీ తన మనసులో మాటనే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు కూడా ఇవే అంటూ తేల్చి చేప్పేశారు…ఇంకెన్నేళ్లు సీఎంగా ఉంటారు.
ప్రధానమంత్రి పీఠం ఎక్కండి అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు సభలో ఉన్న అందరూ హర్షాన్ని ప్రదర్శించారు.
అయితే లోకేష్ సిఎం అభ్యర్ధిగా మహానాడు వేదికగా ప్రకటించడం కూడా ఎంతో వ్యూహాత్మకంగా జరిగిందని.
ఫ్యూచర్ లో చంద్రబాబు కేంద్రంలోనే ఉంటూ బీజేపి వ్యతిరేకంగా ఉన్న శక్తులని ఏకం చేసే పనిలో చంద్రబాబు ఎంతో బిజీ గా ఉంటారని…అంతేకాదు లోకేష్ భవిష్యత్తు దృష్ట్యా ఫ్యూచర్ సీఎం చేయడం కోసం మెల్ల మెల్లగా లోకేష్ వర్గాన్ని కావాలనే దువ్వుతున్నారని తెలుస్తోంది.అందుకే లోకేష్ వర్గం అప్పుడప్పుడు లోకేష్ సిఎం గా ఉంటే చంద్రబాబు కేంద్రంలో ప్రధానిగా ఉంటారంటూ ప్రచారం చేస్తున్నారు కూడా.
అయితే ఇక్కడ మరొక సందేహం కూడా తెలుగుదేశం పార్టీ నేతల్లో నెలకొంది…పార్టీ లో ఉన్న కీలక నేతలు లోకేష్ కి పగ్గాలు ఇవ్వడం పై ఆందోళన వక్తం చేస్తున్నారు.ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గెలుపు దిశగా వెళ్ళే అవకాశం లేకపోవడంతో…ఈ కీలక సమయంలో ఇప్పుడు లోకేష్ కి పగ్గాలు ఇస్తే తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలం అవ్వుతుంది అని అంటున్నారు.
ఈ విషయంపై చంద్రబాబు నిర్ణయం తెలుసుకున్న తరువాత అప్పుడు తమ అభిప్రాయాలు చెప్పనున్నారట.మరి పార్టీలో సీనియర్ నేతల మనోభావాలని చంద్రబాబు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి
.