రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేలటిక్కెట్టు’.ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గత చిత్రాలు ‘సోగ్గాడే చిన్ని నాయన’ మరియు ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ముఖ్యంగా నాగార్జునతో ఈయన చేసిన సోగ్గాడే చిన్ని నాయన ఆ సంవత్సరంలోనే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.
అంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న కళ్యాణ్ కృష్ణ ఖచ్చితంగా ‘నేటిక్కెట్టు’ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు అనే నమ్మకంను అంతా వ్యక్తం చేశారు.
![](https://TeluguStop.com/wp-content/uploads/2018/05/reason-for-nela-ticket-moviflop.jpg)
రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తర్వాత నాగార్జునతో ఈయన సినిమా చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది.ఆ సమయంలోనే ఎప్పటి నుండో రవితేజతో సినిమా చేయాలనుకుంటున్న కళ్యాణ్ కృష్ణ ఆయన్ను సంప్రదించాడు.టచ్ చేసి చూడు సినిమా ఫ్లాప్ అవ్వడంతో మారు మాట్లాడకుండా ఈయన దర్శకత్వంలో సినిమాకు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ.
అతి తక్కువ సమయంలోనే చాలా స్పీడ్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించి అంతే స్పీడ్‌గా విడుదల చేశారు.ఎంత స్పీడ్‌గా అయితే సినిమా వచ్చిందో అంతే స్పీడ్‌గా సినిమా థియేటర్ల నుండి వెళ్లి పోయే పరిస్థితి.
ఈ సినిమా ఫ్లాప్‌కు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
మొదటి కారణం రవితేజ లుక్.
అవును, ఈ చిత్రంలో రవితేజ లుక్ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.పలు సీన్స్‌లో రవితేజ అనారోగ్యంగా ఉన్నాడని, ఆయన మొహంలో కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా క్లీయర్‌గా తెలుస్తోంది.
రవితేజ గత చిత్రాల లుక్‌కు ఈ సినిమా లుక్‌కు చాలా తేడా ఉంది.ఇక రెండవ ప్రధాన కారణం రొటీన్ సోది కథ.ఈ చిత్రం కథను గతంలో వచ్చిన మూడు నాలుగు సినిమాల కథలను మిక్సీ చేసి రెడీ చేసినట్లుగా అనిపించింది.ఇలాంటి కథలు తెలుగు వెండి తెరపై ఎన్నో, ఎన్నో వచ్చాయి.
దాంతో ప్రేక్షకులు బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారు.
మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రధానంగా కామెడీ ఉండాలి.
కాని ఈ చిత్రంలో కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి, కాని కామెడీతో నవ్వించడంలో విఫలం అయ్యాయి.ప్రస్తుతం నేలటిక్కెట్టు చిత్రంకు మహానటి గట్టి పోటీగా ఉంది.
ఆ కారణంగా వారం రోజుల్లోనే అన్ని థియేటర్ల నుండి సర్దేసుకోవడం ఖాయం అంటూ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.సినిమాపై ఉన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తు సొమ్ము పోసి కొనుగోలు చేశారు.
కాని ఇప్పుడు వారికి భారీ నష్టాలు తప్పేలా లేవు.