70 వేల మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలకు ఎసరు?... కారణమిదే..

బీహార్ ప్రభుత్వంకఠిన నిర్ణయం తీసుకుంది.దీంతో బీహార్‌లో వేలాది మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలు డేంజర్ జోన్‌లో పడబోతున్నాయి.

 70,000 Teachers Will Go To The Jobs , Teachers , Patna High Court , Bihar , Bih-TeluguStop.com

2006- 2015 మధ్య నియమితులైన ఉపాధ్యాయులు ఈ డేంజర్ జోన్‌లో ముందుగా ఉన్నారు.ఇందులో మూడున్నర లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు ఉన్నారు.వీరిలో దాదాపు 70 నుంచి 77 వేల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు.77 వేల మంది ఉపాధ్యాయులు నిబంధనల ప్రకారం వారి గుర్తింపు పత్రాలు సమర్పించలేదని ఆ శాఖ నుంచి అందిన సమాచారం.ఈ నిర్లక్ష్యం కారణంగా ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోనున్నారు.బీహార్ రాష్ట్ర పర్యవేక్షణ విభాగం ద్వారా 2,200మందికి పైగా ఉపాధ్యాయులకు సంబంధించి వెయ్యికి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.సర్టిఫికెట్ లేకపోతే ఉద్యోగం ఊడినట్లే.పాట్నా హైకోర్టులో నమోదైన కేసు ప్రకారం మిస్సింగ్ ఫోల్డర్ కేసు దర్యాప్తును బ్యూరోకు అప్పగించేందుకు చర్చలు జరిగాయి.

ఈ కేసులో దాఖలైన వ్యాజ్యం ప్రకారం.2006 నుంచి 2015 మధ్య కాలంలో నియమితులైన ఉపాధ్యాయుల నియామకం చట్టవిరుద్ధమని పేర్కొంది.బీహార్‌లో అటువంటి ఉపాధ్యాయుల సమాచారాన్ని 2022లో నిర్దిష్ట ఫోల్డర్‌లో అప్‌లోడ్ చేయాలని విద్యా శాఖ కోరింది.గడువు ముగిసినా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు.ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై విద్యాశాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ఫలితంగా వేల సంఖ్యలో ఉద్యోగుల తమ ఉద్యోగాలు కోల్పోవచ్చు.

ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు లేఖలు పంపారు.సంబంధిత పత్రాలు ఇంకా అప్‌లోడ్ కాలేదు.

Telugu Bihar, Certificate, Identity, Jobs, Librarians, Patna, Teachers-Latest Ne

ఉద్యోగం పోతే జీతం రికవరీఫోల్డర్లు ఖాళీగా ఉంటే ఉపాధ్యాయుల నియామకం పూర్తిగా చట్టవిరుద్ధమని భావించాల్సి వస్తుందని చెబుతున్నారు.ఆ తర్వాత మానిటరింగ్ బ్యూరో జారీ చేసిన జీతం రికవరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.2006 నుంచి మే 2015 మధ్య బీహార్‌లో మొత్తం 3.52 లక్షల మంది ఉపాధ్యాయులను నియమించారు.ఇందులో రెండు వేల 82 మంది లైబ్రేరియన్లు కూడా ఉన్నారు.వారిలో మూడు లక్షల 11 వేల మంది ప్రాథమిక ఉపాధ్యాయులు కాగా, మిగిలిన లక్షా నాలుగు వేల మంది విద్యా మిత్రులు.రూ.1500 గౌరవ వేతనంపై తిరిగి విధుల్లో చేరిన వారు ఆ తర్వాత పంచాయతీ టీచర్‌గా పదోన్నతి పొందారు.దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది.

Telugu Bihar, Certificate, Identity, Jobs, Librarians, Patna, Teachers-Latest Ne

మరికొంత మంది ఉపాధ్యాయులను.మరోవైపు మరికొంత మంది టీచర్లు ఉద్యోగాలన వీడి వెళ్లనున్నారు.అక్టోబర్ 19, 2022 వరకు శిక్షణ తీసుకోని ఉపాధ్యాయులు ఈ జాబితాలో ఉన్నారు.

ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.అతౌర్ రెహ్మాన్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య నున్న కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube