యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్‌తో 3 అదిరిపోయే బెనిఫిట్స్.. అవేంటంటే..!

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ని నిత్యం వాడేస్తున్నారు.రోజులో కనీసం ఒక యూట్యూబ్ వీడియోనైనా చూసేవారు కోట్లాదిమంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

 3 Incredible Benefits With Youtube Subscription Details, Youtube Channels, Prem-TeluguStop.com

అంతగా యూట్యూబ్ ప్రజలకు దగ్గర అయింది.అందులోనూ యూట్యూబ్ ఉచితంగానే వీడియో సేవలను అందిస్తోంది.

అందుకే యూట్యూబ్ యూజర్లు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు.అయితే యూజర్ల నుంచి రెవిన్యూ సంపాదించేందుకు యూట్యూబ్ సంస్థ ప్రీమియం సర్వీసులను కూడా లాంచ్ చేసింది.

నెలవారీగా లేదా వార్షిక పద్ధతిలో మీరు సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవచ్చు.అయితే దీని వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో చాలామందికి తెలియదు.మరి సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే 3 అదిరిపోయే బెనిఫిట్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

యాడ్ ఫ్రీ కంటెంట్

ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు చూడాలంటే ముందుగా యాడ్స్ చూడాల్సి వస్తోంది.దీనివల్ల టైమ్‌తో పాటు డేటా వేస్ట్ అవుతుంది.అయితే ఈ ప్రకటనలను చూడకుండా నేరుగా వీడియోలను చూడాలనుకునేవారు సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవచ్చు.సబ్‌స్క్రిప్షన్‌తో యాడ్స్ లేకుండా వీడియోలు ప్లే అవుతాయి.

బ్యాక్‌‌గ్రౌండ్ ప్లే, పిక్చర్-ఇన్-పిక్చర్

సాధారణంగా యూట్యూబ్ యాప్‌ను క్లోజ్ చేయగానే ప్లే చేస్తున్న వీడియో ఆగిపోతుంది.దాంతోపాటు ఆడియో కూడా స్టాప్‌ అవుతుంది.అయితే సబ్‌స్క్రిప్షన్‌తో బ్యాక్‌గ్రౌండ్‌లో ఆడియోని వినగలిగే ఫీచర్ లభిస్తుంది.అలాగే పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌లో వీడియోని చూడటం కూడా సాధ్యమవుతుంది.దీనివల్ల యూట్యూబ్ వీడియోలను చూస్తూనే ఇతర యాప్స్ యాక్సెస్ చేయవచ్చు.

Telugu Ad, Background, Offline, Picture Picture, Premium Quality, Youtube-Latest

ఆఫ్‌లైన్ వీడియోలు

సాధారణంగా మనం హై క్వాలిటీ ఆఫ్‌లైన్‌ వీడియోలను డౌన్‌లోడ్ చేయడం కుదరదు.అయితే సబ్‌స్క్రిప్షన్‌తో 720p, 1080p రిజల్యూషన్‌లలో వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు మీరు యూట్యూబ్ లోని ప్రీమియం కంటెంట్‌ను వీక్షించవచ్చు.యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ మంత్లీ ప్లాన్‌ తీసుకోవాలంటే రూ.139 చెల్లించాల్సి ఉంటుంది.ఆటో రెన్యూవల్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకున్న వారికి రూ.129కే మంత్లీ ప్లాన్ లభిస్తోంది.3 నెలల ప్లాన్‌ కోసం రూ.399 చెల్లిస్తే సరిపోతుంది.రూ.1,290తో ఇయర్లీ ప్లాన్ లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube